ఎండలు మండిపోతున్నాయి .బయటకు వెళ్లాలంటేనే భయంవేస్తుంది .వేసవి తాపాన్ని తట్టుకోవటానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలు దాడికి తట్టుకోవాలంటే కొబ్బరిబోండాలు ,చెరుకురసం వంటి పానీయాలను ఆశ్రయిస్తున్నారు సాధారణ జనం. కాని ఈ ఎండను తట్టుకోవాలంటే ఓ చల్లటి బీర్ పడాల్సిందే అంటున్నారు మందుబాబులు . ఈ ఎండవేడికి బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఏకంగా తెలంగాణలో కోటి కి పైగా బీర్ల అమ్మకం జరిగిందని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు . బీర్ల అమ్మకం తెలంగాణాలో రికార్డు స్థాయిని మించి నడుస్తుందని పేర్కొన్నారు .

ఎండలు మండిపోతున్నాయి .బయటకు వెళ్లాలంటేనే భయంవేస్తుంది .వేసవి తాపాన్ని తట్టుకోవటానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలు దాడికి తట్టుకోవాలంటే కొబ్బరిబోండాలు ,చెరుకురసం వంటి పానీయాలను ఆశ్రయిస్తున్నారు సాధారణ జనం. కాని ఈ ఎండను తట్టుకోవాలంటే ఓ చల్లటి బీర్ (Beer)పడాల్సిందే అంటున్నారు మందుబాబులు . ఈ ఎండవేడికి బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఏకంగా తెలంగాణలో కోటికి పైగా బీర్ల అమ్మకం జరిగిందని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు . బీర్ల అమ్మకం తెలంగాణాలో రికార్డు స్థాయిని మించి నడుస్తుందని పేర్కొన్నారు .

గత ఏడాది ఎండాకాలంలో తెలంగాణలో(Telangana) రికార్డుస్థాయిలో జరిగిన బీర్ల అమ్మకం ని దాటి ఈ ఏడాది కేవలం 17 రోజుల్లోనే కోటికి పైగా బీర్ల అమ్మకం జరిగిందని తెలిపారు . ఏప్రిల్ 1వ తేది నుంచి 17వ తేది వరకు 1.01కోట్ల బీర్లు అమ్ముడైనట్లుగా ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. కేవలం 3 జిల్లాలో ఈ అమ్మకం ఎక్కువుగా ఉన్నట్లు తెలిపారు . గ్రేటర్ హైదరాబాద్‌ (Hyderabad)పరిధిలోని రంగారెడ్డి(Ranga Reddy), మేడ్చల్(Medchal) జిల్లాల్లో సగటున రోజుకు 6లక్షల బీర్ల అమ్మకం జోరుగా సాగుతుంది . కేవలం ఈ మూడు జిల్లాల్లోనే 17రోజుల్లో 8,46,175 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ప్రతి ఏడాది వేసవి లో తెలంగాణలో అందులో హైదరాబాద్‌లో(Hyderabad) బీర్‌ల విక్రయాలు బాగా జోరుగా సాగుతాయి..సుమారు కోటిన్నర జనాభా కలిగిన హైదరాబాద్ లో మొత్తం 10,154,100 బీర్లు అమ్ముడైనట్లుగా ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. గతంలో కన్నాఈ అమ్మకాలు భారీగా పెరిగాయి .

Updated On 19 April 2023 1:41 AM GMT
rj sanju

rj sanju

Next Story