✕
సెక్స్‌లో(Romance) పాల్గొనడం వల్ల లైంగిక సుఖమే కాదు ఇద్దరి మధ్య బంధం(Bonding) బలపడుతుందని చెప్తుంటారు. దాంపత్య జీవితం (Marriage life) బాగుంటే లైఫ్ డ్రైవ్ (Life drive)ఈజీగా ఉంటుందని అంటుంటారు. ఒకరిపై మరొకరికి ప్రేమ(Love), ఆప్యాయతలు(Affection) పెరగడానికి సెక్స్ ఉపయోగపడుతుంది. అయితే ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల మంచి నిద్ర(Sleep) వస్తుందని... ఒత్తిడి(Stress) తగ్గడంతోపాటు, క్యాలరీలు(Calories) ఖర్చు చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుందంటున్నారు

x
Romance
-
- సెక్స్‌లో(Romance) పాల్గొనడం వల్ల లైంగిక సుఖమే కాదు ఇద్దరి మధ్య బంధం(Bonding) బలపడుతుందని చెప్తుంటారు. దాంపత్య జీవితం (Marriage life) బాగుంటే లైఫ్ డ్రైవ్ (Life drive)ఈజీగా ఉంటుందని అంటుంటారు. ఒకరిపై మరొకరికి ప్రేమ(Love), ఆప్యాయతలు(Affection) పెరగడానికి సెక్స్ ఉపయోగపడుతుంది. అయితే ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల మంచి నిద్ర(Sleep) వస్తుందని... ఒత్తిడి(Stress) తగ్గడంతోపాటు, క్యాలరీలు(Calories) ఖర్చు చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుందంటున్నారు
-
- తరుచుగా శృంగారంలో పాల్గొంటే గుండె(Heart) ఆరోగ్యం బాగుంటుందని ఓ సర్వేలో(Survey) తేలింది. కనీసం వారానికి(Weekly) రెండుసార్ల కంటే ఎక్కువగా రతిలో పాల్గొనే మగవారిలో గుండెపోటు(Heart stroke) వచ్చే ముప్పు తక్కువని అంటున్నారు. సెక్స్ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి(Immunity Power) పెరుగుతుంది. బెడ్రూమ్లో(Bed room) మీ భాగస్వామితో(Partner) మంచి రొమాన్స్ చేయడం వల్ల ఒత్తిడి కంట్రోల్లో ఉంటుందని చెప్తున్నారు. తలనొప్పి(Headache) లేదా ఒత్తిడి ఉందన్న సాకులతో తనకు దూరంగా ఉండకూడదని.. లైంగిక తృప్తి వల్ల ఆక్సిటోన్(Oxitone) హార్మన్ స్థాయిు ఐదు రెట్లు పెరుగుతాయంటున్నారు.
-
- శృంగార సమయంలో భావప్రాప్తి(Orgasam) పొంది, డీహైడ్రో యిపియాండ్రోస్టిరోన్(Dehydroepiandrosterone) అనే హార్మోన్ విడుదల అవుతుందని.. ఇది ఇమ్యూనిటీని పెంచుతుందంటున్నారు. ఎప్పుడో ఒకసారి రతిలో పాల్గొన్నవారితో పోలిస్తే వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొనేవారు.. ఎక్కువ కాలం జీవిస్తారని తేలింది. రతి క్రీడలో పాల్గొనడంతో హృదయ స్పందన రేటు(Heart beat rate) పెరుగుతుంది. కణాలు, అవయవాలకు తాజా రక్తం అందుతుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు(Toxins) తొలగిపోయే అవకాశం ఉందంటున్నారు.
-
- వ్యాయామం(Exercise), వాకింగ్(Walking) చేస్తే శరీరంలోని కొలెస్ట్రాల్(Cholesterol) ఎలా తగ్గుతుందో.. తరుచుగా రతిలో పాల్గొంటే శరీరంలోని క్యాలరీలు ఖర్చయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇందుకుగాను కనీసం అరగంట పాటు పార్ట్నర్తో(Partner) చక్కని రొమాన్స్ చేయాలట. అంతేకాదు దీనివల్ల ఈస్ట్రోజన్ (Estrozen), టెస్టోస్టిరాన్(Testosterone)హార్మన్ల స్థాయి పెరుగతాయని.. కండరాలు(Muscles), ఎముకలు(Bones) బలంగా తయారవుతాయంటున్నారు. మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మన్ గుండె పోట్ల ముప్పు నుంచి కాపాడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

Ehatv
Next Story