Single Life: వైవాహిక జీవితానికి కొందరు దూరం.. ఎందుకో తెలుసా
సాధారణంగా సర్టెయిన్ ఏజ్ వచ్చిన తర్వాత అందరూ పెళ్లి(Marriage) చేసుకొని పిల్లలను కని, వారి బరువుబాధ్యతలు చూసుకోవాలని అనుకుంటారు. పిల్లలకు, జీవిత భాగస్వామికి (Life partner) మంచి జీవితాన్ని అందించాలని కోరుకుంటారు. పిల్లల పెళ్లిళ్లు (Children) చేసి నిండు నూరేళ్లు హాయిగా గడిపి జీవితం చాలించాలని అనుకుంటారు. సాధారణంగా యుక్త వయస్సు (Young age) వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని పేరెంట్స్ (Parents) ఒత్తిడి చేయడం సహజం. ఇరుగుపొరుగువారు కూడా ఏమ్మా పెళ్లెప్పుడూ అని ఆరా తీస్తుంటారు. దోస్తులయితే (Friends) దావత్ ఇయ్యావారా ఇంకా అని గోల చేస్తుంటారు.

అయితే కొందరు పెళ్లి ఇష్టం లేకనో, ఇష్ట పడ్డ వారు దక్కలేదనో లేక వివాహ వ్యవస్థపై నమ్మకం లేకనో సింగిల్ (Single) డూడ్‌గా ఉండిపోతుంటారు.
కొంతమంది జీవితంలో లవ్ (Love) అంటేనే భయం ఉంటుంది. ప్రేమలు, దోమలు వద్దమ్మా అంటుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉండి ఉండవచ్చు. ఎలాంటి కమిట్‌మెంట్స్ (Commitments) లేకుండా ఒంటరి (Single) జీవితమే హాయిగా ఉందంటూ కాలం గడిపేస్తుంటారు. తన లైఫ్‌లో(Life) స్వేచ్ఛగా జీవించాలనుకుంటారు ప్రేమలకు ససేమిరా అంటుంటారు. దీనికి వారు చెప్పే కారణాలు వారికి ఉండవచ్చు. ప్రేమించేందుకు, రిలేషన్‌షిప్‌ను (Relationship) స్టార్ట్ చేసేందుకు మానసికంగా (phycological) సిద్ధంగా ఉండరు. మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉందంటూ మనల్నే కన్విన్స్ చేస్తుంటారు. ఇంకొందరు తమకు ఇంతకు ముందున్న రిలేషన్‌షిప్ చేదుజ్ఞాపకాలు వెంటపడడంతో మరో ప్రేమను అంగీకరించలేరు. మళ్లీ ఎందుకీ తలనొప్పులని భావిస్తుంటారు. ఇలాంటివారు కూడా సింగిల్ లైఫ్‌లోనే మింగిల్ అవుదామని చూస్తారట.
కొందరికి ఇతరుల మీద నమ్మకం ఉండదు. ఇంకా శృంగార లైఫ్ (Romantic life) అసలే వద్దనే యోచనలో ఉంటారు. పెళ్లి చేసుకుంటే తన జీవిత భాగస్వామిని సుఖపెట్టలేమోనన్న ఫోబియా (Phobia's) వీరిలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ కోవలో ఉన్న గైస్ కూడా సోలో లైఫ్‌కే మొగ్గు చూపుతారట. కొందరికి లైఫ్ పార్ట్‌నర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్(expectations) ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టు లైఫ్‌పార్ట్‌నర్ దొరకలేదని ఒంటరి జీవితానికి అలవాటుపడిపోతుంటారు. తన ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కావాలంటే.. చాలా కాలమే పడుతుందని సోలోగా (Solo) మిగిలిపోతుంటారు. ఇక మరికొందరికైతే కమ్యూనికేషన్ (Communication) లోపం ఉంటుంది. ఇలాంటి వారు తమలోని భావాలను స్పష్టంగా వ్యక్త పర్చలేకపోవడం, ఇన్‌ఫీరియార్టీ కాంప్లెక్స్ (inferiority complex) లోనుకావడంతో పార్ట్‌నర్స్‌తో (Partners) ఇబ్బందులు వస్తాయన్న భయంతో ముందే బిస్తరు కట్టేస్తారు. ప్రేమలు, పెళ్లిళ్ల వైపు వీరి అడుగులు ముందుకు పడవు. సో సోలో లైఫ్ కావాలో.. ఫ్యామిలీ లైఫ్ కావాలో మీరే తేల్చుకోవాలి..