కొంత మంది కారణంగా సోషల్‌ మీడియా(social media) వికృతంగా తయారవుతోంది. చాలా మంది బాధితులు ఉన్నారు. యాంకర్‌, నటి రష్మి(Rashmi Gautham) చెప్పినట్టు నేటి డిజిటల్‌ యుగంలో సురక్షితంగా జీవించడం కష్టమే! టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది వికృత చేష్టలకు పాల్పడుతున్నరని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తన ఫ్యాన్స్‌ను కోరారు రష్మి.

కొంత మంది కారణంగా సోషల్‌ మీడియా(social media) వికృతంగా తయారవుతోంది. చాలా మంది బాధితులు ఉన్నారు. యాంకర్‌, నటి రష్మి(Rashmi Gautham) చెప్పినట్టు నేటి డిజిటల్‌ యుగంలో సురక్షితంగా జీవించడం కష్టమే! టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది వికృత చేష్టలకు పాల్పడుతున్నరని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తన ఫ్యాన్స్‌ను కోరారు రష్మి. ప్రస్తుతం ఉన్న డిజిటల్‌ యుగంలో సురక్షితంగా జీవించడం క్లిష్టంగా మారింది. AI టెక్నాలజీ ఉపయోగించి న్యూడ్‌ ఫొటోలు(Nude Pics) క్రియేట్‌ చేసేవారికి దొరకకుండా అమ్మాయిలను దాక్కోమని చెప్పడం కంటే ఇలాంటి నేరాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని రష్మి చెప్పారు. కనిపించేదంతా నిజం కాదని ప్రజలకు తెలిసేలా చేద్దామని, కేవలం సరదా కోసం అసభ్యకరమైన వీడియోలు సర్క్యూలేట్‌ చేయవద్దని చెబుదామని రష్మి పిలుపునిచ్చారు.
ఏఐ టెక్నాలజీని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ను రష్మి తన ఇన్‌స్టా పేజీలో షేర్‌ చేశారు. ‘‘ఈ పోస్ట్‌ను చూస్తున్న అమ్మాయిలందరూ వెంటనే సోషల్‌మీడియా ఖాతాను ప్రైవేట్‌ చేసుకోండి. అలాగే డీపీలో ఒకవేళ మీ ఫొటో ఉంటే తీసేయండి. మీ ఫొటోలను ఏ ఒక్కరితోనూ పంచుకోవద్దు. ఎందుకంటే, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది దుర్మార్గులు అసభ్యకరమైన ఫొటోల్ని క్రియేట్‌ చేస్తున్నారు. దయచేసి ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ నెటిజన్‌ పెట్టిన సందేశాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు రష్మి.

Updated On 29 Jun 2023 7:18 AM GMT
Ehatv

Ehatv

Next Story