Salman Khan, Venkatesh and Ram Charan : సల్మాన్ ఖాన్, వెంకటేష్.. సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..
ఈమధ్య స్టార్ హీరోలు ఒకరి సినిమాల కోసం మరొకరు హెల్ప్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. గెస్ట్ రోల్స్ చేస్తూ.. సడెన్ ఎంట్రీలతో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నారు ఫిల్మ్ సెలబ్రిటీలు. తాజాగా సౌత్ నార్త్ కలయికలో సిల్వర్ స్క్రీన్ దడదడలాడిపోయింది.

Salman Khan, Venkatesh and Ram Charan
ఈమధ్య స్టార్ హీరోలు ఒకరి సినిమాల కోసం మరొకరు హెల్ప్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. గెస్ట్ రోల్స్ చేస్తూ.. సడెన్ ఎంట్రీలతో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నారు ఫిల్మ్ సెలబ్రిటీలు. తాజాగా సౌత్ నార్త్ కలయికలో సిల్వర్ స్క్రీన్ దడదడలాడిపోయింది.
ఫిల్మ్ ఇండస్ట్రీ(Film Industry)లో మల్టీ స్టారర్ సినిమాలు(Multi Starrer Movies).. కాంబినేషన్లు.. కామన్ గా జరుగుతుంటాయి.. అయితే ఈమధ్య స్టార్ హీరోల గెస్ట్ రోల్స్ ఎక్కువైపోయాయి మూవీస్ లో.. సినిమా పబ్లిసిటీ కోసం.. మూవీ ఇమేజ్ పెంచడం కోసం స్టార్ సెలబ్రిటీలను గెస్ట్ రోల్స్ కు పిలుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఈ ఆచారం ఎక్కువగా నడుస్తోంది.
బాలీవుడ్(Bollywood) లో సల్మాన్(Salman Khan)కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'కిసీ కా భాయ్ .. కిసీ కి జాన్'(Kisi Ka Bhai Kisi Ki Jaan) ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. ఇక ఈ మాస్ సాంగ్ లోనే ఉంది అసలువిశేషం.
ఏంటమ్మా ఏంటమ్మా' అంటూ సాగే ఈ పాటను సల్మాన్ ఖాన్ .. పూజ హెగ్డే తో పాటు .. మొదటి నుంచి చెపుతున్నట్టుగా ఈసినిమాలో సల్మాన్ నో నటిస్తున్న సౌత్ స్టార్ హీరో వెంకటేష్ కూడా కనిపించారు. తెలుగు, హిందీలో మిక్స్ చేసి వదిలిన ఈ పాటలో సడెన్ గా రామ్ చరణ్ కనిపించి ఫ్యాన్న్ ను సర్ ప్రైజ్ చేశాడు. ఎల్లో షర్టులు .. తెల్లని లుంగీలు .. బ్లాక్ కలర్ షూ .. స్పెట్స్ తో సల్మాన్ - వెంకీ.. చరణ్ కనిపించారు. మధ్యలో చరణ్ ఎంట్రీ ఇచ్చి .. మాస్ స్టెప్పులతో సందడి చేశాడు.
రామ్ చరణ్ ఎంట్రీతో సాంగ్ రేంజ్ మారిపోయింది. ఆస్కార్ విన్నర్ గా.. గ్లోబర్ స్టార్ గా.. బాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ను సాధించిన రామ్ చరణ్ ఈపాటలో కనిపించే సరికి.. సల్మాన్ సినిమాకు భారీగా పబ్లిసిటీ కాబోతోంది. ఇటుసౌత్ లో కూడా ఈసినిమా విపరీతంగా ఆడే అవకాశం ఉన్నట్టుతెలుస్తోంది.
