Raana Naidu : ఈ బూతులు ఏంటి రా .... బాబోయ్ ! రానా నాయుడు పై ట్రోల్ల్స్ ఫ్రై .. !
Netflix లో స్ట్రీమ్ అవుతున్న రానా నాయుడు వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ కి నెటిజన్స్ నెగటివ్ కామెంట్స్ తో దగ్గుబాటి ఫామిలీ పై ఆగ్రహం చూపిస్తున్నారు .
Netflix లో స్ట్రీమ్ అవుతున్న రానా నాయుడు వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ కి నెటిజన్స్ నెగటివ్ కామెంట్స్ తో దగ్గుబాటి ఫామిలీ పై ఆగ్రహం చూపిస్తున్నారు . ప్రస్తుతం వెబ్ సిరీస్ హావ జోరుగా నడుస్తుంది . దీనితో తెలుగులో కూడా భారీ రేంజ్ ఉన్న వినూత్నమైన కంటెంట్ తో చాల మంది దర్శకులు వెబ్‌సిరీస్‌ల్లో ప్రయోగాలు జరుపుతన్నారు . తాజాగా వెంకటేష్ ,రానా కలిసి నటించిన రానా నాయుడు కూడా క్రైమ్ ,థ్రిల్లర్ బేస్డ్ గా రూపొందిన వెబ్ సిరీస్ ఇటీవల నెట్ఫ్లిక్ లో మార్చ్ 10 వ తేదీ నుండి స్ట్రీమ్ అవుతుంది .
దగ్గుబాటి ఫామిలీ నుండి ఇద్దరు హీరో లు మొదటిసారి తెర మీద కనిపించిన ఈ సిరీస్ లో రాననాయుడు తీవ్రమైన ట్రోలింగ్ ని ఎదుర్కొంటుంది . వెంకటేష్ కి గత 35 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు . వెంకటేష్ కి ఇండస్ట్రీ లో మంచి ఫామిలీ హీరోగా గుర్తింపు అన్నవిషయం తెలిసిందే . కానీ ఈ వెబ్ సిరీస్ లో ఉన్న బూతులు ,అడల్ట్ కంటెంట్ చూసి ప్రేక్షకులు ఇదేం బూతు పంచాంగం అంటున్నారు. ఫామిలీ పీపుల్ ఈ సిరీస్ చూడద్దు అని చెపేస్తునారు.
దగ్గుబాటి ఫామిలీ కి ఉన్న ఇమేజ్ మొత్తం ఈ సిరీస్ వాళ్ళ నాశనం అవుతుందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు నెట్టిజెన్స్. హాలీవుడ్ రేంజ్ లో వెబ్ సిరీస్ ని అందించేందుకు కంటెంట్ లో న్యూడిటీ ,బోల్డ్ నెస్ తెలుగులో కూడా చూపించటం కొన్ని వర్గాల ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. వెబ్ సిరీస్ కి సెన్సార్ ఉండాలి అనే వాదన ఎప్పటినుండో ఉన్న దీని పైన సరైన కసరత్తులు జరగటం లేదు . అయితే ఈ నెగటివ్ ట్రోల్ల్స్ కి రానా క్షమాపణలు చెప్పారు . ఫస్ట్ ఎపిసోడ్ కె ఇంత దారుణమైన రెస్పాన్స్ ఇక నెక్స్ట్ సీజన్ పరిస్థితి ఏంటో !
రానా నాయుడు వెబ్ సిరీస్ కోసం వెంకటేష్ 12 కోట్లు ,రానా 8 కోట్లు పారితోషకం తీసుకున్నట్లు ప్రచారం. రాబోయే వెంకటేష్ సినిమా
saindhav సినిమా పైన ఏమైనా ఎఫెక్ట్ రావచ్చా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి . బాలయ్య హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్'లో 'రానా నాయుడు'లో బూతులు పండగ అంట కదా!" అని అడగగా రానా అక్కడే దీనికి సమాధానం చెప్పారు . ఏది ఏమైనా వెంకటేష్ నడిచిన ఈ సిరీస్ లో అడల్ట్ ,బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంజీర్ణించుకోలేక పోతున్నారు అభిమానులు .