చాలా మందికి తమ స్మార్ట్‌ ఫోన్‌ కవర్‌లో(Phone Back Case) కరెన్సీ నోట్లు(Currency) పెట్టుకోవడం అలవాటు! అత్యవసర సమయంలో పనికి వస్తాయని అనుకుంటారు. ఇలా ఫోన్‌ కవర్‌లో కరెన్సీ నోట్లు పెట్టుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టే! ఫోన్‌ కవర్‌లో రూపాయి నోట్లను ఉంచడం చాలా ప్రమాదకరం. ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది.

చాలా మందికి తమ స్మార్ట్‌ ఫోన్‌ కవర్‌లో(Phone Back Case) కరెన్సీ నోట్లు(Currency) పెట్టుకోవడం అలవాటు! అత్యవసర సమయంలో పనికి వస్తాయని అనుకుంటారు. ఇలా ఫోన్‌ కవర్‌లో కరెన్సీ నోట్లు పెట్టుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టే! ఫోన్‌ కవర్‌లో రూపాయి నోట్లను ఉంచడం చాలా ప్రమాదకరం. ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఫోన్‌ను చాలా సేపు వాడితే అది వేడెక్కుతుంది. ఈ విషయం మనకు తెలుసు. ఫోన్ వేడెక్కిన వెంటనే ఫోన్ వెనుక భాగంలో దాని ప్రభావం కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఫోన్ కవర్‌లో కరెన్సీ నోటు ఉన్నట్లయితే, ఫోన్ నుంచి వేడి బయటకు విడుదలయ్యే అవకాశం ఉండదు.

ఈ కారణంగా ఆ ఫోను పేలిపోయే(Blast) ప్రమాదం ఉంది. అందుకే ఫోన్‌కు బిగుతుగా ఉండే కవర్‌ను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. కరెన్సీ నోట్లను కాగితంతో తయారుచేసినప్పటికీ రకరకాల రసాయనాలు కూడా ఉపయోగిస్తారు. ఫోన్‌ వేడెక్కిన సమయంలో అది బయటకు వెళ్లకుండా రసాయనాలతో కూడిన కరెన్సీ నోటు అడ్డుపడితే ఆ ఫోన్‌ పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే పొరపాటున కూడా ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్లను పెట్టుకోవద్దని నిపుణులు అంటున్నారు. అలాగే బిగుతుగా ఉన్న కవర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఫోన్‌ కవర్‌ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు.

Updated On 19 Aug 2023 4:36 AM GMT
Ehatv

Ehatv

Next Story