Balesh Dinakar Rape Case : కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి 13 మంది అమ్మాయిల్ని రేప్ చేసి వీడియో తీసాడు .!
ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్‌కర్ చేసిన వికృత చేష్టలు వెలుగులో కి వచ్చాయి.సిడ్నీలోమార్నింగ్ హెరాల్డ్ పత్రిక ద్వారా సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2018 జనవరి నుండిఅక్టోబర్ నెల వరకు మొత్తం 13 మంది మహిళపై అఘాయిత్యం జరిపాడు బాలేశ్ ధన్‌కర్ .
ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్‌కర్ చేసిన వికృత చేష్టలు వెలుగులో కి వచ్చాయి.సిడ్నీలోమార్నింగ్ హెరాల్డ్ పత్రిక ద్వారా సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2018 జనవరి నుండిఅక్టోబర్ నెల వరకు మొత్తం 13 మంది మహిళపై అఘాయిత్యం జరిపాడు బాలేశ్ ధన్‌కర్ .
ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ ఇంటర్వ్యూ లకు పిలిచి అమ్మాయిలకు మత్తు పదార్దాలు కలిపిన పానీయాలను వాళ్లకు పట్టించేవాడు. అతను కూడా మత్తుపదార్దాలను తీసుకొనేవాడు . తన గదిలో కెమెరాలను అమర్చి మత్తు లో మహిళలను శారీరకం గా లోబరుచుకునేవాడు . తాను వారిపైన జరిపే అకృత్యాలను వీడియో ద్వారా రికార్డు చేసేవాడు. అతనికి కొరియన్ అమ్మాయిలంటే పిచ్చి . ధనకర్ రేప్ చేసిన యువతుల్లో ఎక్కువమంది కొరియన్ అమ్మాయిలు కావటం విశేషం. కొరియన్ అమ్మాయిల పేర్లు, వివరాలను జాగ్రత్తగా దాచుకున్నాడు. అతడి గదిలో బెడ్ పక్కనే అలారం క్లాక్‌లోని సీక్రెట్ కెమెరా ద్వారా అన్నీఅఘాయిత్యాలు రికార్డయ్యేవి..
2018 అక్టోబరులో పోలీసులు ఇతడి సొంత ఫ్లాటులో జరిపిన సోదాల్లో మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్, బాటిల్స్, రేప్ వీడియోలతో పాటు 47 వీడియోలతో కూడిన హార్డ్ డ్రైవ్ దొరికింది. న్యూసౌత్ వేల్స్ జిల్లా కోర్టులో బాలేష్ ధనకర్ కేసు విచారణ జరుగుతుంది. అతను రికార్డు చేసిన కొన్ని వీడియోల్లోని అసహ్యకర దృశ్యాలను జడ్జీలు సైతం చూడలేకపోయారని మార్నింగ్ హెరాల్డ్ పత్రిక వివరించింది.
మహిళా అఘాయిత్యాల పట్ల జాతీయ ,అంతర్జాతీయంగా ఎన్ని చట్టాలు రూపొందించినప్పటికీ ఇలాంటి ఘాతుకాలుకు పాల్పడుతూనే ఉన్నారు. అమాయకులైన ఆడవాళ్లు బలవుతూనే ఉన్నారు. ఆడవాళ్ళపై జరిగే ఈ అమానుషాలపై కఠినమైన శిక్షలు ,క్షమాబిక్ష లేని చట్టాలు అమలుకావాలనే వాదనలు వినపడుతున్నాయి .