Salaar : సలార్‌ను నేను తీస్తేనా..వేరే లెవల్లో ఉండేది : పృధ్వీరాజ్ సుకుమారన్
ఒక్కో దర్శకుడికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అడవిరాముడు సినిమాలు విశ్వనాథ్(Viswanath) తీయలేడు. శంకరాభరణాన్ని రాఘవేంద్రరావు(Raghavendra rao) తీయలేడు. ఎవరి స్టయిల్ వారిది! కేజీఎఫ్ సినిమాలతో ఫేమస్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) స్టయిల్ కంప్లీట్ డిఫరెన్స్. ఆయన దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ఒక్కో దర్శకుడికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అడవిరాముడు సినిమాలు విశ్వనాథ్(Viswanath) తీయలేడు. శంకరాభరణాన్ని రాఘవేంద్రరావు(Raghavendra rao) తీయలేడు. ఎవరి స్టయిల్ వారిది! కేజీఎఫ్ సినిమాలతో ఫేమస్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) స్టయిల్ కంప్లీట్ డిఫరెన్స్. ఆయన దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇదే సినిమాను మరో దర్శకుడు తీస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఈసినిమాలో నటించిన పృధ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) తీశాడే అనుకుందాం.. అది ఏ లెవల్లో ఉంటుంది? ఇదే ప్రశ్నను పృధ్వీరాజ్‌ను అడిగితే మరో లెవల్లో ఉంటుందని సమాధానం ఇచ్చాడు. పృధ్వీరాజ్ కూడా మంచి దర్శకుడే! గాడ్‌ఫాదర్ సినిమాకు ఈయనే దర్శకుడు(Director) అన్న విషయం తెలిసిందే! సలార్ సినిమా గురించి ఆయన ఏం చెప్పారంటే..'ఒక్కో డైరెక్టర్‌కు ఒక్కో విజన్ ఉంటుంది. సలార్(Salaar) సినిమాను అయిదుగురికి ఇస్తే అయిదు రకాలుగా తీస్తారు. నాకు ఇస్తే నేను సలార్‌ను మరింత డిఫరెంట్‌గా తీస్తాను. ప్రశాంత్ నీల్ తీసిన సలార్ చూశాను. చాలా బాగా తీశాడు. నాకు అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా డిఫరెంట్‌గా తీస్తా. ఇంకా బాగా తీస్తానేమో! అయితే సలార్ సినిమాలో ప్రశాంత్ అద్భుతమైన డ్రామాను పండించాడు. నాకు అది బాగా నచ్చింది. సినిమాను ఒప్పుకోవడానికి అదే కారణం. సలార్ సినిమా స్క్రిప్ట్‌లో(Script) కంటే తెర మీదకు వచ్చిన తర్వాత ఇంకా బాగుంది. ఇద్దరు స్నేహితుల మీద ప్రశాంత్ సినిమా తీస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు' అని పృథ్వీరాజ్ అన్నారు. ప్రశాంత్ నెరేషన్ తర్వాత సలార్ ను ఒకలా ఊహించుకున్నానని, తెరపైకి వచ్చిన తర్వాత అది నెక్ట్స్ లెవెల్ లో(Next level) ఉందని తెలిపాడు. ప్రశాంత్ టాలెంట్ అదేనని, రాజమౌళి కూడా తనతో ఇదే విషయం చెప్పారని అన్నాడు. ప్రశాంత్ స్క్రిప్ట్ కు ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ఉండదట! ఫస్ట్ టేక్ కు, రెండో టేక్ కు స్క్రిప్ట్ మారిపోతుందని పృథ్వీరాజ్ తెలిపాడు. సలార్ క్లయిమాక్స్ కూడా పృధ్వీరాజ్ కు చెప్పినప్పుడు ఒకలా ఉందట, షూటింగ్ కు వచ్చేసరికి పూర్తిగా మారిపోయిందంట! అలా మారిన క్లయిమాక్స్ చూసి తనకు మతిపోయిందని, సలార్ క్లయిమాక్స్ ను థియేటర్లలో చూసి ఎంజాయ్ (Enjoy)చేయాల్సిందేనని పృధ్వీరాజ్ అంటున్నాడు.