ఒడిశాలో(odisha) హెడ్‌మాస్టర్(Headmaster) పరిమితి దాటి ప్ర‌వ‌ర్తించాడు. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్ప‌డానికి బదులు.. మ‌హిళ‌కు ప్రేమ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. పాఠశాల ఆవరణలోనే రాస లీలలకు తెర‌లేపాడు. బాధ్య‌తాయుత‌మైన‌ హోదాను మ‌రిచి స్కూల్ కుక్(school Cook) తో ప్రేమలో పడ్డాడు. చివరికి అతని రాస‌లీల‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఒడిశాలో(odisha) హెడ్‌మాస్టర్(Headmaster) పరిమితి దాటి ప్ర‌వ‌ర్తించాడు. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్ప‌డానికి బదులు.. మ‌హిళ‌కు ప్రేమ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. పాఠశాల ఆవరణలోనే రాస లీలలకు తెర‌లేపాడు. బాధ్య‌తాయుత‌మైన‌ హోదాను మ‌రిచి స్కూల్ కుక్(school Cook) తో ప్రేమలో పడ్డాడు. చివరికి అతని రాస‌లీల‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ప్రధానోపాధ్యాయుడి మెడలో బూట్ల దండ వేసిన‌ గ్రామస్తులు గ్రామంలో తిప్పారు.

ఒడిశాలోని సుందర్‌గఢ్(Sundergarh) జిల్లా బాలంగ్ పోలీస్ స్టేషన్(Balang Police station) పరిధిలోని ఖాదియాబహల్ సేవాశ్రమంలో ఈ ఘటన జరిగింది. ఖాదియాబహల్ సేవాశ్రమ ప్రధానోపాధ్యాయుడు రోహిత్ కుమార్ రాయ్(Rohit Kumar Roy) పాఠశాల వంట మనిషితో కొన్నాళ్లుగా అక్రమ సంబంధం(illicit relationship) పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై రెండేళ్ల క్రితం స్కూల్ కమిటీ సమావేశం జరిగింది. ఆ స‌మావేశంలో ఇద్దరినీ హెచ్చరించి వదిలేశారు.

అయితే.. దీని తర్వాత కూడా వారు మునుపటిలా రిలేషన్‌షిప్ కొన‌సాగిస్తున్నారు. ఇద్దరూ పాఠ‌శాల‌లోని గ‌దుల‌లో త‌మ కామ కార్య‌క‌లాపాలు కొన‌సాగించేవారు. దీంతో పాఠశాలలో విద్యా వాతావరణం పూర్తిగా దిగజారింది. ఇది పిల్లలపై చెడు ప్రభావం చూపడం ప్రారంభించింది. వారి విచ్చ‌ల‌విడిత‌నాన్ని భ‌రించ‌లేక‌ చాలా మంది పిల్లలు చదువు మానేసినట్లు చెబుతున్నారు.

వేసవి సెలవుల అనంతరం గత బుధవారం పాఠశాలను తిరిగి తెరిచారు. శుక్రవారం ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు(Headmaster), వంట మహిళ అసాంఘిక కార్యకలాపాలకు(non-social activities) పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో గ్రామస్తులు మళ్లీ పాఠశాలకు చేరుకున్నారు. గ్రామస్తులు(villagers) వారిద్దరినీ మూసి ఉన్న గదిలో నుంచి బయటకు తీసుకువ‌చ్చారు. ఇద్దరినీ పాఠశాల నుంచి బయటకు లాగి విచారించారు. ఇద్దరూ తమ తప్పును అంగీకరించి భవిష్యత్తులో అలా జరగదని చెప్పినా.. ఆగ్రహించిన గ్రామస్తులు వారి మాట వినే పరిస్థితిలో లేరు. ఇన్ ఛార్జి ప్రధానోపాధ్యాయుని మెడలో చెప్పుల దండ వేసి గ్రామం చుట్టూ తిప్పారు.

అనంత‌రం గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కోయిడా ఎస్‌డిపిఓ మాట్లాడుతూ.. ఇద్దరూ పెద్దవాళ్లని, వంట మహిళ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, కాబట్టి ఉపాధ్యాయుడు రోహిత్ కుమార్ రాయ్‌పై ఎటువంటి చర్య సాధ్యం కాదని చెప్పారు.

దీంతో ఎడ్యుకేషన్ అధికారికి లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడిని బదిలీ చేయాలని కోరినట్లు ఎస్‌డిపిఓ తెలిపారు. అయితే ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Updated On 26 Jun 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story