Princess Leonor : కఠినమైన శిక్షణకు రెడీ అయిన స్పెయిన్ యువరాణి
మన దగ్గర యువరాణులు ఎంత సుకుమారంగా పెరుగుతారో చెప్పాల్సిన పనిలేదు. పైగా చాలా మందిలో యువరాణి అన్న గర్వం కూడా ఉంటుంది. కాలు కదపకుండా కావాల్సినవన్నీ ఆమె దగ్గరకే వచ్చేస్తాయి. కానీ స్పెయిన్‌లో(Spain) అలా కాదు.. ప్రిన్సెస్ లియోనోర్‌కు(Leonor Princess) మొన్నీమధ్యనే 18 ఏళ్లు నిండాయి. ఆ పుట్టినరోజు వేడుకల్లోనే తన దేశ రాజ్యాంగానికి విధేయతతో ప్రమాణం చేసింది. రాణిగా ఆమె సింహాసనాన్ని అధిష్టించే ముందుగా ఆమె మూడేళ్లపాటు కఠినమైన శిక్షణ(Training) తీసుకోవలసి ఉంటుంది. ఇందులో ఆమె తొలి అడుగులు పూర్తి చేసుకుంది. తన శిక్షణకు సంబంధించిన మొదటి దశను అధిగమించింది.
మన దగ్గర యువరాణులు ఎంత సుకుమారంగా పెరుగుతారో చెప్పాల్సిన పనిలేదు. పైగా చాలా మందిలో యువరాణి అన్న గర్వం కూడా ఉంటుంది. కాలు కదపకుండా కావాల్సినవన్నీ ఆమె దగ్గరకే వచ్చేస్తాయి. కానీ స్పెయిన్‌లో(Spain) అలా కాదు.. ప్రిన్సెస్ లియోనోర్‌కు(Leonor Princess) మొన్నీమధ్యనే 18 ఏళ్లు నిండాయి. ఆ పుట్టినరోజు వేడుకల్లోనే తన దేశ రాజ్యాంగానికి విధేయతతో ప్రమాణం చేసింది. రాణిగా ఆమె సింహాసనాన్ని అధిష్టించే ముందుగా ఆమె మూడేళ్లపాటు కఠినమైన శిక్షణ(Training) తీసుకోవలసి ఉంటుంది. ఇందులో ఆమె తొలి అడుగులు పూర్తి చేసుకుంది. తన శిక్షణకు సంబంధించిన మొదటి దశను అధిగమించింది. క్వీన్ లెటిజియా, కింగ్ ఫెలిపే దంపతులిద్దరూ కలిసి తమ పెద్ద కూతురు లియోనోర్‌ను స్పెయిన్‌లో అరగోన్‌లో ఉన్న జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజా దగ్గర వదిలిపెట్టారు. స్పెయిన్ సింహాసనానికి వారసురాలు అయిన లియోనోర్ అధికారికంగా మూడేళ్ల పాటు కఠినమైన సైనిక శిక్షణను తీసుకోవాలి. అందుకు ఆమె సంసిద్ధంగా ఉంది. సైనిక్ స్కూల్‌లో(Military school) చేరుతున్న సమయంలో ఆమె మొహంలో సంతోషం కనిపించింది. తల్లిదండ్రులతో పాటు తన 16 ఏళ్ల చెల్లెలు ప్రిన్సెస్ సోఫియాతో కలిసి అకాడమికి వచ్చారు. లియోనోర్ తండ్రి కింగ్ ఫెలిపే సైనిక యూనిఫాం ధరించి, సైన్యం, నావికాదళం, స్పెయిన్ వైమానిక దళానికి చెందిన కెప్టెన్ జనరల్‌గా(Captain General) ఆమెకు సెల్యూట్ చేశాడు. కింగ్ ఫెలిపే స్పానిష్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కూడా గతంలో బోర్బన్ సింహాసనాన్ని అందుకుంటున్న సమయంలో జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజాలో శిక్షణ తీసుకున్నారు. లియోనార్ తల్లి క్వీన్ లెటిజియా కూడా సంతోషంగానే కనిపించారు. లియోనార్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. గర్వంగా చూసింది. కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికిన లియోనార్ అకాడమీ వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లారు. తన లగేజ్‌ను తానే మోసుకుంటూ వెళ్లారు. యువరాణి అయినప్పటికీ ఆమెలో వీసమెత్తు గర్వం కూడా కనిపించలేదు. అందరిలాగే ఎంట్రీ బుక్‌లో(Entry Book) తన పేరు రాసి సంతకం పెట్టి మరీ లోపలికి వెళ్లారు. ప్రాథమిక విద్యను శాంటా మారియా డి లాస్ రోసేల్స్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న లియోనార్ ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత బ్రిటన్ లోని వేల్స్ యుడబ్ల్యూసీ అట్లాంటిక్ కాలేజీలో ఇంటర్నేషనల్ బాకలారియట్ ప్రొగ్రామ్‌ను అభ్యసించారు. అటు పిమ్మట 2023, ఆగస్టు 17న మిలటరీ అకాడమీలో తన మూడేళ్ల సైనిక శిక్షణను ప్రారంభించారు. మొదటి స్టేజీ దాటుకున్న లియోనార్ తాజాగా కఠినమైన శిక్షణ తీసుకునేందకు సిద్ధమయ్యారు.