డబ్బుని పొదుపు చేయాలనీ ఎన్ని విధానాల అమలు ఉన్న మనం సెక్యూరిటీ పరం గా గవెర్నమెంట్ అందించే పథకాలవైపు మొగ్గు చూపిస్తుంటాం. ప్రజలసంక్షేమల దృష్ట్యా మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేక పొదుపు పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి.

డబ్బుని పొదుపు చేయాలనీ ఎన్ని విధానాల అమలు ఉన్న మనం సెక్యూరిటీ పరం గా గవెర్నమెంట్ అందించే పథకాలవైపు మొగ్గు చూపిస్తుంటాం. ప్రజలసంక్షేమల దృష్ట్యా మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేక పొదుపు పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న మొత్తాల నుండి పొదుపు చేసుకొనే వీలుని కలిపిస్తుంది . రిస్క్ తక్కువ ఉన్న రంగం కాబట్టి ప్రజలు పోస్ట్ ఆఫీస్ అందించే వినూత్న పథకాలను వినియోగించుకుంటున్నారు .

పోస్ట్‌ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌ స్కీమ్‌ అనే సరికొత్త పొదుపు పథకం తో పోస్ట్ ఆఫీస్ మరో స్కీం ను తీసుకు వచ్చింది . ఈ పథకం ద్వారా రూ. 100 నుంచి ఎంతవరకైనా మనం పెట్టుబడిని పెట్టుకోవచ్చు. ఎలాంటి రిస్క్‌ లేని పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (పీఓఆర్‌డీ) కు ఐదు సంవత్సరాల మెచ్యూరిటీఉంటుంది . 5 సంవత్సరాలకు ఒకసారి పొడిగించకోవచ్చు .ఈ స్కీం లో సింగిల్‌గానే కాకుండా, ముగ్గురు వరకు ఉమ్మడి ఖాతా తెరిచే వీలుంటుంది . ఎవరైనా ముందుగా ఆర్‌డీని క్లోజ్ చేయాలనుకుంటే.. మూడేళ్ల తర్వాత క్లోజ్‌ చేసుకోవచ్చు

ఇందులో మీరు రూ. 6 లక్షలు పెట్టుబడి పెడితే, వడ్డీ ద్వారా రూ. 96,968 లభిస్తుంది.ఈ స్కీమ్‌ను మరో ఐదేళ్లు పొడగితస్తే.. రూ. 16,26,476 గ్యారంటీ ఫండ్‌ లభిస్తుంది.మీరు రూ. 12 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ ద్వారా రూ. 4,26,476 లభిస్తుంది. నెలకు 10వేల రూపాయల వరకు ఈ పథకం లో పొదుపు చేస్తే దేళ్ల తరువాత మీకు రూ.6,96,968 రిటర్న్‌ లభిస్తుంది.జనవరి 1వ తేదీ నుంచి పోస్టాఫీసు ఆర్‌డీ ఏడాదికి 5.8 శాతం వడ్డీని అందిస్తుంది . త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది .

Updated On 17 March 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story