Poonam Vs Trivikram : తప్పులు చేసి తప్పించుకోవడంలో త్రివిక్రమ్ ఘటికుడు .. పూనమ్ కౌర్ సంచలన కామెంట్
దర్శకుడు, రచయిత త్రివిక్రమ్(Trivikram) శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ విరుచుకుపడ్డారు. మహేశ్‌బాబు హీరోగా, త్రివిక్రమ్ రూపొందించిన గుంటూరుకారం(Guntur Karam) సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా కథను మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనరాణి(Yaddanbapudi sulochana rani) రాసిన కీర్తికిరీటాలు నుంచి తీసుకున్నారంటూ ఓ ప్రముఖ వెబ్‌సైట్ ఓ కథనాన్ని రాసింది. ఆ వెబ్‌సైట్ పోస్టుకు పూనమ్ కౌర్(Poonam kaur) రియాక్టయ్యారు.

poonam
దర్శకుడు, రచయిత త్రివిక్రమ్(Trivikram) శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ విరుచుకుపడ్డారు. మహేశ్‌బాబు హీరోగా, త్రివిక్రమ్ రూపొందించిన గుంటూరుకారం(Guntur Karam) సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా కథను మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనరాణి(Yaddanbapudi sulochana rani) రాసిన కీర్తికిరీటాలు నుంచి తీసుకున్నారంటూ ఓ ప్రముఖ వెబ్‌సైట్ ఓ కథనాన్ని రాసింది. ఆ వెబ్‌సైట్ పోస్టుకు పూనమ్ కౌర్(Poonam kaur) రియాక్టయ్యారు. త్రివిక్రమ్ ఏమైనా చేయగలడని, ఆయన చేసే తప్పులు ప్రజలకు కనిపించవని పూనమ్ పేర్కొన్నారు. తప్పుల నుంచి బయటపడటం ఎలాగో ఆయనకు తెలుసని పూనమ్ వ్యాఖ్యానిస్తూ గత సీఎం ఆఫీసులో త్రివిక్రమ్‌కు ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చారో తెలియడం లేదని ట్వట్(Tweet) చేశారు. ప్రజలకు లేని అనుమతులు ఇతడికి ఎందుకు కల్పించినట్టు? అంటూ ప్రశ్నించారు. తప్పుడు పనులు చేస్తూ తప్పించుకోవడం గురూజీకి(Guruji) అలవాటు అంటూ సెటైర్లు విసిరారు పూనమ్ కౌర్! మరి పూనమ్ కామెంట్లకు త్రివిక్రమ్ రియాక్టవుతారా? లేక లైట్ తీసుకుంటారా? అన్నది చూడాలి.
