సినిమాల్లో(Movies) కాని.. రాజకీయాల్లో(Politics) కాని బండ్లగణేష్(bandla ganesh) చాలా స్పెషల్ అని చెప్పాలి. కొంత కాలంగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండ్ల.. మళ్ళీ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. సంచలన కామెంట్స్ కూడా చేశాడు.

సినిమాల్లో(Movies) కాని.. రాజకీయాల్లో(Politics) కాని బండ్లగణేష్(bandla ganesh) చాలా స్పెషల్ అని చెప్పాలి. కొంత కాలంగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండ్ల.. మళ్ళీ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. సంచలన కామెంట్స్ కూడా చేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా ఎదిగి.. నిర్మాతగా స్టార్ డమ్ అందుకున్నాడు. సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన గణేష్.. ఆతరువాత రాజకీయాల్లో కూడా చేరారు. కాంగ్రేస్(congress) తరపున ప్రచారాలు డిబెట్ లు చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రతీ విషయంలో బండ్ల గణేష్ పదాలు, సూటిమాటలు.. ఆయన తీరే వేరు.

ఇక సోషల్ మీడియాలో బడ్ల చేసే సందడి అంతా ఇంతా కాదు. ఏదైనా ఇష్యూ ఉంటే దానికి సబంధించి ఆయన చేసే ట్వీట్ కోసం.. బండ్ల చేసే కామెంట్ల కోసం ఎదురుచూస్తుంటారు ఆడియన్స్. గత కొద్ది కాలంగా కాంట్రవర్సీలకు, పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ.. వస్తున్న బండ్ల.. తాజాగా మళ్లీ రాజాకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈక్రమంలో తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ సీనీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం కర్నాటక ఎలక్షన్స్ హడావిడి నడుస్తోంది. కాంగ్రేస్ భారీ మెజారిటీతో అక్కడ గెలుపొందింది. అయితే ఈ రిజల్ట్ కు ముందే బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో.. నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం అంటూ ట్వీట్ చేశారు. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి బాయ్ బాయ్, నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై. రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే కష్టం, రాజకీయాలంటే పౌరుషం, రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా అని వరుసగా ట్విట్టర్ బాణాలు వదిలారు బండ్గ గణేష్.

Updated On 14 May 2023 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story