Demonitisation : పెట్రోల్ పోయించుకుని రూ.2 వేల నోటిస్తే సిబ్బంది ఏం చేశారు?
రెండు వేల రూపాయల నోటు సెప్టెంబర్ 30వ తేదీ వరకు చలామణిలో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చెప్పినప్పటికీ చాలా మంది ఆ నోటును తీసుకోవడానికి జంకుతున్నారు. కొందరు వ్యాపారులు రెండు వేల రూపాయల నోటు తీసుకోబడదు అంటూ బోర్డులు కూడా పెట్టేసుకున్నారు.
రెండు వేల రూపాయల నోటు సెప్టెంబర్ 30వ తేదీ వరకు చలామణిలో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చెప్పినప్పటికీ చాలా మంది ఆ నోటును తీసుకోవడానికి జంకుతున్నారు. కొందరు వ్యాపారులు రెండు వేల రూపాయల నోటు తీసుకోబడదు అంటూ బోర్డులు కూడా పెట్టేసుకున్నారు. సామన్య ప్రజల నుంచి రెండువేల రూపాయల నోటును తీసుకోవడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) జలౌన్ జిల్లాలో దీనికి సంబంధించి ఓ గమ్మతైన ఘటన వెలుగు చూసింది. ఓ వాహనదారుడు పెట్రోల్ బంక్‌కు వెళ్లి తన వాహనంలో పెట్రోల్ పోయించుకున్నాడు. తర్వాత రెండు వేల రూపాయల నోటిచ్చాడు. బంక్ సిబ్బంది దాన్ని పుచ్చుకోలేదు. తన దగ్గర ఇది కాకుండా మరే డబ్బులేదని చెప్పినా వినిపించుకోలేదు.
యాక్టివా వెహికిల్‌లో పోసిన పెట్రోల్‌ను(Petrol) పైపు సాయంతో బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగాడుతోంది. ఈ వీడియోను పోలీసులు కూడా చూశారు. ఆర్‌బీఐ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని వ్యాపారులకు సూచించారు. రెండు వేల రూపాయల నోటును తీసుకోనివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే జరిగిందనుకోకూడదు. దేశమంతటా ఇదే పరిస్థితి. అన్ని పెట్రోల్ బంక్‌ల్లో ఇలాగే ఉంది. చాలా బంక్‌ల్లో రెండు వేల రూపాయల నోటును తీసుకోబోమని బోర్డులు పెట్టాయి.