ఇప్పుడు ఉత్తర భారతమంతా ఎడతెగని వర్షాలతో, పోటెత్తుతున్న వరదలతో అతలాకుతలమవుతోంది. పడితే కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. లేకపోతే మొహం చాటేస్తాయి. అలాంటి సమయాల్లోనే వాన కోసం ప్రార్థనలు చేస్తాం. నిజమే మరి...!అనుకున్న సమయానికి వాన రాకపోతే అరిష్టమే! కరువు తాండవిస్తుంది. అందుకే వాన కోసం రకరకాలుగా ప్రార్థనలు చేస్తారు.. ప్రపంచమంతటా ఈ రకమైన ఆచారాలున్నాయి.

ఇప్పుడు ఉత్తర భారతమంతా ఎడతెగని వర్షాలతో, పోటెత్తుతున్న వరదలతో అతలాకుతలమవుతోంది. పడితే కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. లేకపోతే మొహం చాటేస్తాయి. అలాంటి సమయాల్లోనే వాన కోసం ప్రార్థనలు చేస్తాం. నిజమే మరి...!అనుకున్న సమయానికి వాన రాకపోతే అరిష్టమే! కరువు తాండవిస్తుంది. అందుకే వాన కోసం రకరకాలుగా ప్రార్థనలు చేస్తారు.. ప్రపంచమంతటా ఈ రకమైన ఆచారాలున్నాయి. వరుణదేవుడి కరుణ కోసం చేయాల్సిందంతా చేస్తారు. మన దగ్గర కప్పలకు పెళ్లిల్లు(Frogs Marriage) చేస్తారు. చెట్లకు అక్షింతలు వేస్తారు. గాడిదలకు పెళ్లిల్లు చేస్తారు. కర్నాటకలోని ఓ ఊర్లో ఓ బాలుడిని నగ్నంగా(Nude boy) ఊరేగిస్తారు కూడా! మరో ఊర్లో ఇద్దరబ్బాయలకు పెళ్లి(Men Marriage) చేశారు.. వానలు సమృద్ధిగా కురవాలన్న మంచి తలంపుతోనే చేసే తంతులు ఇవి! కొన్ని భయం కలిగిస్తాయి కూడా! వాన దేవుడి కటాక్షం కోసం ముళ్ల మీద నడుస్తారు కొందరు..

నిప్పు గుండంలో పరుగెడతారు.. సమాధులను(Graves) తవ్వి ఎముకలతో పూజలు చేస్తారు కొందరు. ఎందుకూ అంటే వరుణదేవుడి కోసమంటారు. చినుకు రాలుతుందని నమ్మకంతో చెబుతారు. ఇక మెక్సికోలోని(Mexico) కొన్ని గ్రామాల్లో అయితే రక్తం కారేట్టు కొట్టుకుంటారు. వర్షం(Rains) కోసం రక్తం ధారపోస్తుంటారు. అలా చేస్తేనే వరుణుడు శాంతిస్తాడట!
ఈ ముష్టిఘాతాలకు(fistfights) ముందు చాలా తతంగం ఉంటుంది. మహిళలంతా పొద్దున్నే నిద్రలేచి రుచికరమైన పిండివంటలు తయారు చేస్తారు. మాంసాహారంతో(Non-veg food) పాటు శాకాహారం(Veg Food) కూడా ఉంటుంది. మొత్తంమీద బలవర్ధకమైన ఆహారాన్నే వండుతారు. వండిన వంటకాలన్నింటినీ గ్రామ సరిహద్దుల్లోకి తెస్తారు. రకరకాల పూలతో(flowers) వాటిని అలంకరిస్తారు(Decoration). భూమ్యాకాశాలను ప్రార్థిస్తారు. వాన దేవుడైన టియాలోక్‌కు నైవేద్యం సమర్పించకుంటారు.
ఆ తర్వాత మొదలవుతుంది కొట్లాట! ఒకరొకరు పిడిగుద్దులు కొట్టేసుకుంటారు. ఇక్కడ గెలుపోటములు అంత ఇంపార్టెంట్‌ కాదు. రక్తాలు(blood) కారాయా లేదా అన్నది ముఖ్యం. కొట్లాటకు చిన్నాపెద్ద అన్న తేడా లేదు. అందరూ తలో చేయివేస్తారు. సంధ్య చీకట్లు ముసిరే వరకు అలా కొట్టుకుంటూనే ఉంటారు.. అంతా అయ్యాక అప్పటి వరకు కొట్టుకున్నవారే నవ్వుకుంటూ ఆలింగనాలు చేసుకుంటారు. సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎవరికి ఇళ్లకు వారు చేరతారు. తీవ్రంగా గాయపడిన వారిని మాత్రం జాగ్రత్తగా ఇంటికి చేరుస్తారు.

కారిన రక్తాన్ని బకెట్లతో నింపి పొలాలలో(Fields) చల్లుతారు. వర్షం కోసం ఇలా కొట్టుకోవడం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లకు కోపం వచ్చేస్తుంది. అసలు ఈ సంప్రదాయం ఎలా వచ్చిందన్నది వివరిస్తారు.. ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తిన్నగా ఉండేవారు కాదట! ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారట! చీటికి మాటికి కొట్టేసుకునేవారట! ఇదంతా వానదేవుడు టియాలోక్‌కు చికాకు తెప్పించిందట! వర్షం కురిపించడం మానేశాడట! అప్పట్నుంచి అందరూ పాత పగలను మర్చిపోయి స్నేహంగా మెలగడం ప్రారంభించారట! వరుణదేవుడిని శాంతింపచేయడం కోసం స్నేహపూర్వకంగా దెబ్బలాడుకోవడం మొదలు పెట్టారు. ఇది నయం. మెక్సికోలోని ఇంకొన్ని ప్రాంతాలలో ఇంతకంటే భయంకరమైన ఆచారాలున్నాయి.. పులి వేషాలు వేసుకుని నృత్యాలు చేస్తూ కొరడాలతో కొట్టుకుంటారక్కడ.. అది కూడా రక్తం కారేలా కొట్టుకుంటూ వర్షం కోసం ప్రార్థనలు చేస్తారు..

Updated On 10 July 2023 3:32 AM GMT
Ehatv

Ehatv

Next Story