పెగాసెస్‌(Pegasus) స్పైవేర్‌ వివాదం మరోసారి ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టడానికి నరేంద్రమోదీ ప్రభుత్వంపెగాసస్‌ స్పైవేర్‌ను ప్రయోగిస్తున్నదంటూ అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టేసింది. విపక్షాలకు జవాబు ఇవ్వకుండా తప్పించుకుంది. మోదీ(Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని లేటెస్ట్‌గా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌(Washington post) సంయుక్తంగా జరిపిన పరిశోధనలో బయపడంది. యాపిల్‌(Apple) సంస్థ ఈ ఏడాది అక్టోబరులో జారీ చేసిన హ్యాక్‌ అలర్ట్‌ల నేపథ్యంలో..

పెగాసెస్‌(Pegasus) స్పైవేర్‌ వివాదం మరోసారి ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టడానికి నరేంద్రమోదీ ప్రభుత్వంపెగాసస్‌ స్పైవేర్‌ను ప్రయోగిస్తున్నదంటూ అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టేసింది. విపక్షాలకు జవాబు ఇవ్వకుండా తప్పించుకుంది. మోదీ(Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని లేటెస్ట్‌గా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌(Washington post) సంయుక్తంగా జరిపిన పరిశోధనలో బయపడంది. యాపిల్‌(Apple) సంస్థ ఈ ఏడాది అక్టోబరులో జారీ చేసిన హ్యాక్‌ అలర్ట్‌ల నేపథ్యంలో.. ఇద్దరు పాత్రికేయుల ఫోన్లలో ఆ స్పైవేర్‌ జాడలను కనుగొన్నట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ గురువారం ప్రకటించింది. ది వైర్‌ పోర్టల్‌ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్ధ వరద రాజన్‌(Siddartha varadarajan), ది ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసీసీఆర్‌పీ)కు చెందిన ఆనంద్‌మంగ్నాలే(Anand Mangnale ) లకు చెందిన ఫోన్‌లపై ప్రభుత్వ ప్రాయోజిత హ్యకింగ్‌ జరుగుతోందంటూ యాపిల్‌ సంస్థ నుంచి అలర్ట్‌లు రావడంతో వీరిద్దరు తమ ఫోన్‌లను పరీక్ష నిమిత్తం ఆమ్నెస్టీకి అందించారు. వారి ఫోన్‌లను తమ సెక్యూరిటీ ల్యాబ్‌లో పరిశీలించామని, వాటిలో పెగాసస్‌ ఆనవాళ్లు ఉన్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. తమ కర్తవ్యాన్ని బాధ్యగా నిర్వర్తిస్తున్న జర్నలిస్టులను(Journalists) టార్గెట్‌ చేయడమంటే, వారి వ్యక్తిగత గోప్యతపై అన్యాయంగా దాడిచేయడమేనని, వారికున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని ఆమ్నెస్టీ సెక్యూరిటీ ల్యాబ్‌ చీఫ్‌ డోన్‌చా ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌లో(Iseral) రూపు దిద్దుకున్న పెగాసస్‌ను వరద రాజన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించడం ఇది రెండోసారి. 2021లో కూడా పలువురు జర్నలిస్టులతో పాటు వరద రాజన్‌ పై కూడా ప్రభుత్వం నిఘాపెట్టింది. ఆయన ఫోన్‌లో పెగాసన్‌ స్పైవేర్‌ను అమర్చింది. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సన్నిహితుడైన అదానీ(Adani) వ్యాపార కార్యకలాపాలపై పరిశోధన జరుపుతున్నందుకే మంగ్నాలేని టార్గెట్‌ చేశారని వాషింగ్టన్‌ పోస్టు తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూపు పెగాసెస్‌ పేరుతో స్పైవేర్‌ను రూపొందించింది. దీన్ని ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతుంది. 2017లో మన ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎన్‌ఎస్‌ఓ గ్రూపు నుంచి కొన్ని పరికరాలను కొన్నట్టు ఓసీసీఆర్‌పీనే బయటపెట్టింది. ఇది జరిగిన పది నెలలకే ఓసీసీఆర్‌పీ ఎడిటర్‌ ఆనంద్‌ మంగ్నాలే ఫోన్‌ పెగాస్‌సతో ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది. 40 మందికి పైగా భారతీయ పాత్రికేయులు, ప్రతిపక్షాలకు చెందిన ముగ్గురు అతిపెద్ద నేతలు, రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి, ఇద్దరు కేంద్రమంత్రులు, వివిధ భద్రతా సంస్థలకు చెందిన తాజా, మాజీ అధిపతులు, పలువురు వ్యాపారవేత్తలు.. ఇలా 300 మంది పెగాసస్‌ నిఘాలో ఉన్నారంటూ 2021లో పెగాసస్‌ నిఘాపై ద వైర్‌ ఓ సంచలన్మాతక కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయిల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ తాను రూపొందించిన పెగాసస్‌ స్పైవేర్‌ ను ప్రపంచం లోని పలు దేశాల ప్రభుత్వాలకు విక్రయించింది. దీన్ని ఎవరి ఐ ఫోన్‌(I Phone) లో అమరుస్తారో వారు పంపే ఫోన్‌ సందేశాలు, ఈ-మెయిల్స్‌, ఫొటోలు చూడవచ్చు. ఫోన్‌ సంభాషణలను సైతం వినవచ్చు. ఆయా వ్యక్తులు ఎక్కడ ఉన్నదీ తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తుల చిత్రాలను కెమేరాలో నిక్షిప్తం చేయవచ్చు..

Updated On 29 Dec 2023 4:53 AM GMT
Ehatv

Ehatv

Next Story