అవును అంబెడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరలో లోని గౌతమి గోదావరిలో మత్యకారుల గేలానికి ఏకంగా 15 కేజీల పండుగప్ప చిక్కింది.గోదావరిలో ఇంత భారీ పండుగప్ప చేప దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని మత్యకారులు తెలిపారు. గోదావరి లో దొరికే పండుగప్ప చేప మంచి రుచిగా ఉండటంతో మాంస ప్రియులు దీనిని కొనడానికి పోటీ పడ్డారు.
పండుగప్పని సముద్రపు చేపల రుచులో రారాజు గా చెప్తారు. ఇది గాలానికి చెక్కిందా ఇక ఆరోజు చేప ప్రియులకి పండుగే. అలాంటిది 15 కేజీల పండుగప్ప గాలానికి చిక్కితే?
అవును అంబెడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరలో లోని గౌతమి గోదావరిలో మత్యకారుల గేలానికి ఏకంగా 15 కేజీల పండుగప్ప చిక్కింది.గోదావరిలో ఇంత భారీ పండుగప్ప చేప దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని మత్యకారులు తెలిపారు. గోదావరి లో దొరికే పండుగప్ప చేప మంచి రుచిగా ఉండటంతో మాంస ప్రియులు దీనిని కొనడానికి పోటీ పడ్డారు.
ఈ చేపను స్థానిక మార్కెట్ వేలం వేయగా మత్యకార దంపతులు పోనమండ భద్రం,రత్నం లు 9 వేల రూపాయల కు దక్కించుకున్నారు. గోదావరి జిల్లాలో ని శుభకార్యాలలో పులస పులుసు తరహాలో పండుగప్ప చేప కూర,వేపుడు వంటకాన్ని మాంసప్రియులు ఇష్టం గా తింటారు.