మన దేశంలో పబ్జీ వంటి గేమ్‌లపై నిషేధం ఉన్నా పలువురు ఇతర మార్గాల ద్వారా గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆడుతున్నారు. తాజాగా పబ్జీ గేమ్‌ ఓ ఫ్యామిలీలో చిచ్చు రేపింది. పబ్డీలో పరిచయమైన యువకుడి కోసం ఓ పాకిస్తాన్‌(Pakistan )మహిళ పిల్లలతో కలిసి భర్తను వదిలేసి ఇండియాకు వచ్చింది. ఈ వింత ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన సచిన్‌ అనే యువకుడికి పాకిస్తాన్‌కు చెందిన సీమా గులామ్‌ హైదర్‌ అనే మహిళతో పబ్జీ ద్వారా పరిచయం అయ్యింది.

పబ్జీ గేమ్‌(PUBG Game) మన దగ్గర బ్యాన్‌ అయ్యింది కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఎన్ని ఉపద్రవాలు చూసి ఉంటామో! పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు ఆ గేమ్‌కు అడిక్టయ్యారు. నిద్రాహారాలు మానేసి గేమ్‌లో మునిగిపోయారు. ఎంతో మంది అనారోగ్యం బారిన పడ్డారు. కొందరు చనిపోయారు కూడా!
మన దేశంలో పబ్జీ వంటి గేమ్‌లపై నిషేధం ఉన్నా పలువురు ఇతర మార్గాల ద్వారా గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆడుతున్నారు. తాజాగా పబ్జీ గేమ్‌ ఓ ఫ్యామిలీలో చిచ్చు రేపింది. పబ్డీలో పరిచయమైన యువకుడి కోసం ఓ పాకిస్తాన్‌(Pakistan )మహిళ పిల్లలతో కలిసి భర్తను వదిలేసి ఇండియాకు వచ్చింది. ఈ వింత ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన సచిన్‌ అనే యువకుడికి పాకిస్తాన్‌కు చెందిన సీమా గులామ్‌ హైదర్‌ అనే మహిళతో పబ్జీ ద్వారా పరిచయం అయ్యింది. అప్పటికే మహిళకు పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్నారు. పబ్జీలో సీమా, సచిన్‌లు రోజూ గంటలతరబడి చాటింగ్‌ చేసుకునేవారు. అలా మొదలైన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వచ్చేసేటంతగా ప్రేమ ముదిరింది. గత నెల నేపాల్‌ మీదుగా తన నలుగురు పిల్లలతో ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు సీమా గులామ్‌ హైదర్‌. అటు నుంచి బస్‌లో గ్రేటర్‌ నోయిడాకు వచ్చి తన ప్రియుడిని కలుసుకున్నారు. మహిళ , ఆమె పిల్లలతో కలిసి సచిన్‌ రుబుపెర ప్రాంతంలో అద్దె ఇంట్లో జీవించడం మొదలు పెట్టాడు. అయితే పాకిస్తాన్‌ మహిళ నోయిడాలో అక్రమంగా నివసిస్తుందని స్థానిక పోలీసులకు సమాచార అందింది. సీమా గులామ్‌ హైదర్‌ విషయం పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించిన సచిన్‌ ఆమెను తీసుకుని పారిపోయాడు. ఎట్టకేలకు నోయిడాలో అక్రమంగా నివసిస్తున్న సీమా, ఆమె పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆశ్రయం కల్పించిన సచిన్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. వీరు మే నెలలో ఇంటిని అద్దెకు తీసుకున్నారట! తమకు కోర్టు ద్వారా పెళ్లి జరిగిందని, నలుగురు పిల్లలు ఉన్నారని చెప్పినట్టు వారు నివసించిన అపార్ట్‌మెంట్‌ యజమాని బ్రిజేష్‌ పోలీసులకు తెలిపాడు. సీమా పాకిస్తాన్‌కు చెందిన మహిళలా కనిపించడం లేదని, ఆమె సల్వార్‌ సూట్‌, చీరలు ధరించేదని యజమాని చెప్పుకొచ్చాడు. పోలీసులకు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు

Updated On 4 July 2023 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story