Pakistan Mob Attack : పాకిస్తాన్లో యువతిపై మూక దాడికి ప్రయత్నం..రక్షించిన మహిళా పోలీసు
వేసుకున్న బట్టలపై ఖురాన్‌ను(Quran) కించపరిచే రాతలు, అవి కూడా అరబిక్ (Arabic)భాషలో ఉన్నాయంటూ ఓ యువతిని చుట్టుముట్టారు కొందరు దుండగులు. పాకిస్తాన్‌లోని(Pakistan) లాహోర్‌లో జరిగింది ఈ సంఘటన. అయితే వెంటనే ఓ మహిళా పోలీసులు(Police) ఆ యువతిని ఆ ముష్కర మూక నుంచి రక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. గుంపు చుట్టుముట్టినప్పుడు పాపం ఆ యువతికి ఏం చేయాలో పాలుపోలేదు.
వేసుకున్న బట్టలపై ఖురాన్‌ను(Quran) కించపరిచే రాతలు, అవి కూడా అరబిక్ (Arabic)భాషలో ఉన్నాయంటూ ఓ యువతిని చుట్టుముట్టారు కొందరు దుండగులు. పాకిస్తాన్‌లోని(Pakistan) లాహోర్‌లో జరిగింది ఈ సంఘటన. అయితే వెంటనే ఓ మహిళా పోలీసులు(Police) ఆ యువతిని ఆ ముష్కర మూక నుంచి రక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. గుంపు చుట్టుముట్టినప్పుడు పాపం ఆ యువతికి ఏం చేయాలో పాలుపోలేదు. భయంతో బిగదీసుకుపోయింది. తన ముఖం కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకుంది. ఈ సమయంలోనే ఆ మహిళా పోలీసు ఆపద్భాంధవురాలిగా వచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. ఆమెను రక్షించి(Rescued) అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ వీడియెను ఆ మహిళా పోలీసును ఉద్దేశించి పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు ఎక్స్(Twitter)లో పోస్ట్ చేశారు. ఆమె పేరును ప్రతిష్టాత్మక క్వాడ్ ఏ అజామ్ పోలీస్ మెడల్‌కు(Police medal) రిఫర్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. అరబిక్‌లో ఏవో పదాలు రాసి ఉన్న దుస్తులు వేసుకున్న మహిళ ఆమె భర్తతో కలిసి షాపింగ్‌కు(Shopping) వచ్చిందని, వెంటనే ఆ మహిళ దగ్గరకు కొందరు వచ్చి కుర్తాను తీసేయాలని డిమాండ్ చేశారని ఆ మహిళా పోలీసు చెప్పారు. దీనికి స్పందించిన ఆ మహిళ డిజైన్ బాగున్నందునే వాటిని కొన్నాననని సమాధానమిచ్చిందట! తనకు ఖురాన్‌ను కించపరిచే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేసిందని మహిళా పోలీసు తెలిపింది. అయితే మహిళ ధరించిన దుస్తులపై ఖురాన్‌పై ఎలాంటి కించపరిచే రాతలు లేవని సోషల్ మీడియలో చాలామంది పోస్టులు చేశారు. ఇటీవలి కాలంలో చాలా దేశాలలో మతం పేరు మీద మూకదాడి సంస్కృతి పెరిగిపోయిందని, రాజకీయాల కోసమే కొందరు వీటిని ప్రోత్సహిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.