అట్లాంటిక్‌ మహా సముద్రం(Atlantic Ocean) ఓ అయిదుగురు ప్రాణాలను బలిగొన్న టైటాన్ సబ్‌ మెర్సిబుల్‌(Titan submersible) విషాదం జరిగి పది రోజులైనా కాలేదు. అప్పుడే టైటానిక్‌ శకలాలు చూద్దాము రారండి అంటూ ఓషన్‌గేట్‌ యాడ్స్‌తో మళ్లీ ఊదరగొడుతోంది. మరి ఇంత నీచమా అంటూ అమెరికాకు చెందిన ఈ అండర్‌ వాటర్‌ టూరిజం కంపెనీ తీరుపై జనం మండిపడుతున్నారు.

అట్లాంటిక్‌ మహా సముద్రం(Atlantic Ocean) ఓ అయిదుగురు ప్రాణాలను బలిగొన్న టైటాన్ సబ్‌ మెర్సిబుల్‌(Titan submersible) విషాదం జరిగి పది రోజులైనా కాలేదు. అప్పుడే టైటానిక్‌ శకలాలు చూద్దాము రారండి అంటూ ఓషన్‌గేట్‌ యాడ్స్‌తో మళ్లీ ఊదరగొడుతోంది. మరి ఇంత నీచమా అంటూ అమెరికాకు చెందిన ఈ అండర్‌ వాటర్‌ టూరిజం కంపెనీ తీరుపై జనం మండిపడుతున్నారు. వందేళ్ల కిందట అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిన టైటానిక్‌ నౌక శకలాలను చూడటానికి ఇదే మా అహ్వానమంటూ లేటెస్ట్‌గా ఓషన్‌గేట్‌ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. టైటాన్‌ సబ్‌ మెర్సిబుల్‌ విషాదం నుంచి ఇంకా ఎవరూ తేరుకోలేదు. ఎంతో కష్టంగా శకలాలను బయటకు తీసుకొచ్చారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఓషన్‌గేట్‌ సంస్థ ఇలాంటి ప్రకటనలు ఇవ్వడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓషన్‌గేట్ వెబ్‌సైట్‌ ప్రకారం వచ్చే ఏడాది రెండు ట్రిప్‌లకు ప్రకటన ఇచ్చుకుంది. . 2024 జూన్‌ 12వ తేదీ నుంచి జూన్‌ 20 మధ్య, అలాగే 2024 జూన్‌ 21 నుంచి జూన్‌ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్‌ చేసింది ఓషన్‌గేట్‌ కంపెనీ. టికెట్‌ ధరను రెండున్నర లక్షల డాలర్లుగా ప్రకటించింది. అయితే ప్రయాణికులను తీసుకెళ్లే సబ్‌ మెర్సిబుల్‌ పేరును మాత్రం ప్రకటించలేదు. ఇదిలా ఉంటే సబ్‌ పైలట్‌ పొజిషన్‌ కోసం కూడా కంపెనీ ఒక యాడ్‌ ఇచ్చింది. టైటాన్‌ శకలాల గాలింపు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. దాంతో ఆ జాబ్‌ యాడ్‌ను ఓషన్‌గేట్‌ సంస్థ తొలగించింది. టైటాన్ విషాదం తర్వాత అనేక విమర్శలు రావడంతో భవిష్యత్తులో ఓషన్‌గేట్‌ ఇలాంటి పర్యటనలు నిర్వహించదని అందరూ అనుకున్నారు. పైగా ఈ ప్రమాదంలో కంపెనీ సీఈవో స్టాక్‌టన్‌ రష్‌ కూడా దుర్మరణం పాలయ్యారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఓషన్‌గేట్ మళ్లీ టైటానిక్‌ టూర్‌ను నిర్వహించడానికి సిద్ధమవ్వడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓషన్‌గేట్‌ టైటాన్‌ ప్రయాణంపై గతంలోనూ బోల్డన్ని విమర్శలు వచ్చాయి. టైటాన్‌ సబ్‌మెర్సిబుల్ నిర్మాణం అట్లాంటిక్‌ అడుగు వరకు ప్రయాణించడానికి వీలుగా లేదని పలురువు నిపుణులు చెప్పి చూశారు. అయినా పట్టించుకోలేదు. టైటాన్‌తోనే పర్యటనకు వైపు మొగ్గు చూపించి.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది కంపెనీ.

Updated On 30 Jun 2023 6:39 AM GMT
Ehatv

Ehatv

Next Story