ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ9 (TV() ఓ బ్రాండ్. టీవీ 9తోనే ట్వంటీఫోర్ అవర్స్ న్యూస్ ఛానెల్ అంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలుగువారికి పరిచయం అయ్యింది. ఛానెల్ పుట్టుక నుంచి సంచలనమే! రవిప్రకాశ్ (Ravi Prakash) నేతృత్వంలో టీవీ9 అగ్రగామిగా వెలుగొందింది.
ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ9 (TV9) ఓ బ్రాండ్. టీవీ 9తోనే ట్వంటీఫోర్ అవర్స్ న్యూస్ ఛానెల్ అంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలుగువారికి పరిచయం అయ్యింది. ఛానెల్ పుట్టుక నుంచి సంచలనమే! రవిప్రకాశ్ (Ravi Prakash) నేతృత్వంలో టీవీ9 అగ్రగామిగా వెలుగొందింది. ఎన్ని న్యూస్ చానెళ్లు వచ్చినా టీవీ9 దరిదాపుల్లో నిలువలేకపోయాయి. తెలుగులో మొదలుపెట్టి క్రమక్రమంగా ఇతర భాషల్లోకి అడుగుపెట్టిన టీవీ 9 ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద నెట్‌వర్క్‌గా విస్తరించింది. ఇప్పుడు టీవీ 9 మైహోమ్ రామేశ్వరరావు (Rameshwar rao) అధీనంలో ఉంది. బయట వినిపిస్తున్న ముచ్చటేమిటంటే త్వరలో టీవీ9 చేతులు మారబోతున్నదని! కాంగ్రెస్ (Congress) పార్టీ టీవీ9ను టేకోవర్ చేయాలని అనుకుంటున్నదట! కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు ఓ ఛానెల్ అంటూ లేదు. న్యూస్ పేపర్ కూడా లేదనుకోండి! ఇప్పటి వరకు ఆ పార్టీకి ప్రమోషన్ లేకుండా పోయింది అందుకే! కాంగ్రెస్ చేపట్టిన ఏ కార్యక్రమానికి కూడా మీడియాలో పెద్దగా ఫోకస్ ఉండేది కాదు! తెలుగునాట ప్రతీ రాజకీయ పార్టీకి సొంతంగా మీడియా హౌజ్‌లున్నాయి. ఈ క్రమంలో తమకు కూడా ఓ మీడియా ఉంటే బాగుంటుందని కాంగ్రెస్ అనుకుంటోందట! తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ టీవీ9ను టేకోవర్ చేసే ఆలోచనలో ఉందని సమాచారం! టీవీ 9 కన్నడ (TV9 Kannada) ఛానెల్ కూడా నంబర్‌వన్‌గా ఉంది. ఈ రెండింటిని హస్తగతం చేసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడతాయని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.