Niharika Konidela Divorce: మెగా డాటర్స్ కి పెళ్లిళ్లు కలిసి రావా .?
మెగా డాటర్ విడాకులు తీసుకోబుతుంది. గత కొద్దికాలంగా మెగా స్టార్ ముద్దుల కూతురు కొణిదెల శ్రీజ విడాకులపైనా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపించాయి. గత సంక్రాంతి నుండి ఇంస్టాగ్రామ్ లో ఇంటిపేరు మార్చుకోవటం తో శ్రీజ ,కళ్యాణ్ దేవ్ ల వివాహజీవితం లో ఉన్న విభేదాల గురించి చర్చ మొదలైంది. ఈ విషయం పైన అధికారకంగా ఎవ్వరు నోరు మెదపలేదు కానీ ఇంస్టాగ్రామ్ లో శ్రీజ పోస్ట్లు ద్వారా తన ఒంటరి జీవితాన్ని ఎలా ఎంజాయ్ […]
మెగా డాటర్ విడాకులు తీసుకోబుతుంది. గత కొద్దికాలంగా మెగా స్టార్ ముద్దుల కూతురు కొణిదెల శ్రీజ విడాకులపైనా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపించాయి. గత సంక్రాంతి నుండి ఇంస్టాగ్రామ్ లో ఇంటిపేరు మార్చుకోవటం తో శ్రీజ ,కళ్యాణ్ దేవ్ ల వివాహజీవితం లో ఉన్న విభేదాల గురించి చర్చ మొదలైంది. ఈ విషయం పైన అధికారకంగా ఎవ్వరు నోరు మెదపలేదు కానీ ఇంస్టాగ్రామ్ లో శ్రీజ పోస్ట్లు ద్వారా తన ఒంటరి జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తుంది అనేది షేర్ చేస్తూ ఉంది. కళ్యాణ్ దేవ్ కూడా ఇక శ్రీజ తో బంధం పూర్తిగా తెగిపోయింది అన్నట్లు సందేశం ఇచ్చే పోస్టులను షేర్ చేయటం జరిగింది. శ్రీజ కళ్యాణ్ దేవ్ లకు ఒక పాపా కూడా ఉంది.
శ్రీజ ,కళ్యాణ్ దేవ్ లు విడిపోవడానికి కారణాలు విషయానికి వస్తే కల్యాణదేవ్ చిత్రంలో నటించే ఒక హీరోయిన్ తో క్లోజ్ గా ఉండటమే దీనికి కారణం అంటున్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీరిద్దరి విడాకులపైనా క్లారిటీ రాకుండానే ,మెగా ఫామిలీలో మరో అమ్మాయి నిహారిక కొణిదల విడాకుల విషయం పైన వార్తలు వినబడుతున్నాయి. గతంలో కూడా నిహారిక తన భర్త తో కలిసి ఉండటం లేదు అనే పుకార్లు వచ్చినపటికి అవన్నీ షిట్ అని చెప్తూ వారు బంధం అందరికి తెలిసేలా ఒక ఫోటోతో సమాధానం చెప్పారు .
నిహారిక కొణిదెల ,చైతన్య జొన్నలగడ్డ ఇద్దరు ప్రేమించి పెద్దలని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత నిహారిక నటనకు స్వస్తి చెప్పి నిర్మాతగా బిజీగా గడుపుతుంది. ఆమద్యన జరిగిన పబ్ గొడవల్లో నిహారిక మరోసారి హైలైట్ అయింది.ఆ తర్వాత నిహారిక భర్త ,అతని స్నేహితులు అనుచిత ప్రవర్తనతో చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులు కంప్లైంట్ చేయటం తో వారు అక్కడి అపార్ట్మెంట్ ఖాళీ చేసి వేరే చోట మకాం మార్చారు. వీరిఇద్దరు విడిపోవడానికి గల కారణాలు ఇంకా బయటకు రాలేదు . మెగా డాటర్ నిహారిక ఇంస్టాగ్రామ్ లో చైతన్య ను unfollow చేసారు. చైతన్య కూడా నిహారికకు unfollow చేసారు. వారి పెళ్లి ఫోటీలో అన్ని చైతన్య అకౌంట్ నుండి తొలగించారు .దీనితో ఈ సారి వీరు విడిపోయారు అనే విషయం నిజమే !అన్న వార్తలు వినపడుతున్నాయి . శ్రీజకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి .నువ్వు కూడా ఇంకో పెళ్ళికి రెడీ అయ్యావా ?అంటూ ఘాటు విమర్శలు వినబడుతున్నాయి .