మెగా డాటర్‌ నిహారిక కొణిదెల(Niharika Konidela)- జొన్నలగడ్డ చైతన్య(Chaitanya) అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పర విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. జులై 4వ తేదీన కూకట్ పల్లి(Kukatpally) ఫ్యామిలీ కోర్టులో(Family Court) నిహారిక విడాకుల దరఖాస్తు(Divorce application) బయటకు రావటం సంచలనంగా మారింది.

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల(Niharika Konidela)- జొన్నలగడ్డ చైతన్య(Chaitanya) అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పర విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. జులై 4వ తేదీన కూకట్ పల్లి(Kukatpally) ఫ్యామిలీ కోర్టులో(Family Court) నిహారిక విడాకుల దరఖాస్తు(Divorce application) బయటకు రావటం సంచలనంగా మారింది. ఆ దరఖాస్తుతో వీళ్లిద్దరూ త్వరలోనే అధికారికంగా వేరు కానున్నారు.

జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నిహారిక కోర్టుకెళ్లారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక దరఖాస్తు చేసుకున్నారు. హిందూ చట్ట ప్రకారం విడాకుల కోసం ఆమె దరఖాస్తు చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతూ ఉంది. 2020లో చైతన్యతో నిహారిక వివాహం జరగగా.. కొన్నాళ్ల నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.

నిహారిక- చైతన్యలు 2020 డిసెంబర్‌ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని(Rajasthan) ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో(Udaipur) వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే రెండేళ్లకే వీరి పెళ్లి బంధానికి ఫుల్ స్టాప్ పడింది. గ‌త‌ కొన్ని రోజులుగా వీరిద్ద‌రు వేర్వేరుగా ఉంటున్నారు.

Updated On 4 July 2023 10:02 AM
Ehatv

Ehatv

Next Story