అనసూయ(Anasuya)ఆంటీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఊసుపోక ఎవరో ఒక నెటిజన్.. అనసూయను కదిలించి మరీ.. ఆంటీ అంటూ ఉడికిస్తున్నారు. మరోసారి అనసూయకు ఆంటీ షాక్ తగిలింది. గతంలో అనసూయ ఆంటీ వివాదం ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో కొందరు యాంకర్ అనసూయని ఆంటీ.. ఆంటీ అంటూ ఏడిపించేశారు. అటు అనసూయ కూడా ఏమాత్రం తగ్గకుండా వారికి రివర్స్ కౌంటర్లు ఇస్తూ.. వాడి వేడి చర్చ జరిగింది.

అనసూయ(Anasuya)ఆంటీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఊసుపోక ఎవరో ఒక నెటిజన్.. అనసూయను కదిలించి మరీ.. ఆంటీ అంటూ ఉడికిస్తున్నారు. మరోసారి అనసూయకు ఆంటీ షాక్ తగిలింది. గతంలో అనసూయ ఆంటీ వివాదం ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో కొందరు యాంకర్ అనసూయని ఆంటీ.. ఆంటీ అంటూ ఏడిపించేశారు. అటు అనసూయ కూడా ఏమాత్రం తగ్గకుండా వారికి రివర్స్ కౌంటర్లు ఇస్తూ.. వాడి వేడి చర్చ జరిగింది. ఆకరికి అనసూయ తనను ఆంటీ అన్నారని పోలీసు కేసు పెడతానంటూ సోషల్ మీడియాలోవార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ఆంటీ.. అనసూయ ఈరెండు పదాలు సోషల్ మీడియాలో చాలా రోజులు ట్రెండింగ్ లో ఉన్నాయంటే.. ఆ ప్రభావం ఎంత ఉందో చెప్పొచ్చు. ఇక వారి బాధ తట్టుకోలేక ఓసారి ఈ విషయంలో సైబర్ స్టేషన్(Cyber Station) లో కంప్లైయింట్ కూడా చేసింది అనసూయ.

ఎంత జరిగినా.. అటు అనసూయ కాని.. ఇటు నెటిజన్లు కాని ఏమాత్రం తగ్గలేదు. పోలీస్ కంప్లైట్ చేసినా సరే ట్రోలర్స్ ఇంకా రెచ్చిపోయారు కాని తగ్గలేదు. ఇద్దరు పిల్లలున్న నిన్ను ఆంటీ అనపోతే ఏమనాలి అంటూ తమస్టైల్లో రెచ్చిపోయారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రముఖులపై అసభ్యకరమైన పోస్టులు, ట్రోలింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, బాధితుల నుంచి కంప్లైట్స్ తీసుకుని.. వారిపై చర్యలు తీసుకుంటామని, హైదరాబాద్ క్రైమ్ DCP స్నేహ మెహ్రా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు కూడా. అయితే ఈ విషయాన్ని అనసూయ తన పోస్ట్ ద్వారా తెలిపింది.

అయితే అనసూయ పెట్టిన పోస్ట్ .. తిరిగి తన మెడకే చుట్టుకుంది. ఇది అనసూయకు రివర్స్ అయింది. మీరు మాత్రం అసభ్యకరంగా ఫోటోలు పెట్టొచ్చా? ఆంటీ అంటే తప్పా? ఇది మీ లాంటి వాళ్లకు కాదు, అలాంటి అసభ్యకరమైన ఫోటోలు పెట్టి మీరే చెడగొడుతున్నారు అంటూ చాలా మంది నెటిజన్లు అనసూయకు చురకలు అంటిస్తున్నారు. రకరకాల కామెంట్లతో.. అనసూయపై ఫైర్ అవుతున్నారు. ఫన్నీ కామెంట్స్ తో ఆటపట్టిస్తున్నారు. మరోసారి ఆంటీ, ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆంటీ అంటే అసభ్యకరంగా తిట్టినట్టా అని ఇంకోంత మంది ప్రశ్నిస్తున్నారు.

ముగిసిపోయిన వివాదాన్ని అనసూయా చేతులారా కదిలించింది. ఎప్పుడో అనసూయ ఆంటీ,,, పదాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. . మళ్లీ ఇన్నాళ్లకు ఆమె వల్లనే... మరోసారి ఆంటీ పదాలని ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు. సైలెంట్ గా ఉన్న వాళ్ళని పోస్ట్ పెట్టి మరీ మళ్ళీ ఆంటీ అనిపించుకుంటుంది అని ఇంకొంతమంది అనసూయను కామెంట్ చేస్తున్నారు.

Updated On 30 March 2023 11:54 PM GMT
Ehatv

Ehatv

Next Story