బట్ట తల (Bald head) అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసు నుంచి పెద్ద వయసు వారు దీని బారిన పడుతూనే ఉన్నారు. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడంతో దానిని కవర్ చేసుకునేందుకు యువత నానా తంటాలు పడుతున్నారు
బట్ట తల (Bald head) అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసు నుంచి పెద్ద వయసు వారు దీని బారిన పడుతూనే ఉన్నారు. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడంతో దానిని కవర్ చేసుకునేందుకు యువత నానా తంటాలు పడుతున్నారు. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు వైద్యుల దగ్గరికి వెళ్లి రకరకాల మందులు తెచ్చుకుంటారు. అంతే కాకుండా ఇంట్లోనే పలు రెమెడీలు తయారు చేసుకుంటుంటారు. బట్టతల ఉంటే పిల్లనివ్వరన్న మానసిక వ్యధ యువతను కుంగదీస్తోంది. పూర్తిగా బట్టతల వచ్చినవారైతే రకరకాల విగ్గులు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (Hair Transplantation) చేయించుకుంటున్నారు.
ఇక నుంచి మనకు ఈ తంటాలు అవసరం లేదంటున్నారు. ఓ పరికరాన్ని తలపై రోజుకు అరగంటపాటు పెట్టుకుంటే చాలంటున్నారు. హెల్మెట్ మాదిరిగా ఉండే ఈ పరికరం తలకు పెట్టుకుంటే తలపై ఉన్న మూలకణాలను ఇది ఉత్తేజ పరుస్తుందని చెప్తున్నారు. ఆస్ట్రియాకు చెందిన నియోస్టెం కంపెనీ (Neostem Company) 'హెయిర్‌లాస్ ప్రివెన్షన్ వెయిరబుల్' (Hairloss Prevention Wearable) పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర దాదాపు రూ.75 వేలుగా ఉంది. 899 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. ఈ పరికరాన్ని తలకు తొడుక్కున్న 6 నెలల్లోనే మంచి ప్రయోజనాలు వస్తాయని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా రాలిపోయిన చోట కూడా జుట్టును తిరిగి మొలిపిస్తుందని నియోస్టెం కంపెనీ ప్రకటించింది.