Sperm Exchanged In Hospital For IUI Process : వీర్యం తారుమారు చేసిన ఆసుపత్రి సిబ్బంది.. ఫలితంగా రూ.1.5 కోట్ల పరిహారం
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) జరిగిన ఘటన ఇది...పద్నాలుగేళ్ల కిందట ఓ దంపతులు కృత్రిమ గర్భధారణ(artificial insemination) కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రివారు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే 2009లో వారికి కవలపిల్లలు పుట్టారు. పుట్టిన బిడ్డలను చూసుకుని ఆ భార్యభర్తలు మురిసిపోయరు.
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) జరిగిన ఘటన ఇది...పద్నాలుగేళ్ల కిందట ఓ దంపతులు కృత్రిమ గర్భధారణ(artificial insemination) కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రివారు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే 2009లో వారికి కవలపిల్లలు పుట్టారు. పుట్టిన బిడ్డలను చూసుకుని ఆ భార్యభర్తలు మురిసిపోయరు. కొన్నిరోజులయ్యాక ఎందుకో తండ్రికి అనుమానం వచ్చింది. శిశువులకు డీఎన్ఏ(DNA Test) పరీక్షలు జరిపించాడు. ఆ పిల్లలకు తండ్రి మరొకరని అందులో తేలింది. కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన ఆ మహిళకు ఆమె భర్త వీర్యం(Semen) బదులుగా మరొకరి వీర్యాన్ని ఎక్కించారు ఆసుపత్రి సిబ్బంది.
తీవ్రమైన మనో వేదనకు గురైన ఆ దంపతులు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను(NCDRC) సంప్రదించారు. తమకు న్యాయం చేయాలని, రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించేలా సదరు ఆసుపత్రిని ఆదేశించాని విజ్ఞప్తి చేసుకున్నారు భార్యాభర్తలు. సుదీర్ఘ విచారణ తర్వాత ఎన్‌సీడీఆర్‌సీ దంపతులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. మనో క్షోభతో బాధపడుతున్న ఆ దంపతులకు 1.5 కోట్ల రూపాయల పరిహారం(Compensation) చెల్లించాలని ఆసుప్రతిని ఆదేశించింది. ఇదే సందర్భంలో ప్రైవేటు హాస్పిటళ్లలో కౄత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను తయారు చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.