ఇదివరకు స్టార్ హీరోలను చూడాంటే ఎంత కష్టం అయినా.. ఇంటికి వెళ్లేవారు.. కాని రాను రాను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వచ్చే వరకూ.. స్టార్స్ ఫ్యాన్స్ మధ్య దూరం తగ్గిపోయింది. ఏదైనా సరే నెట్టింట్లోనే(Internet) చూసుకుంటున్నారు. హీరోలు... హీరోయిన్లు ఎవరైనా సరే.. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటేనే.. సినిమాల్లో కూడా ఫాలోయింగ్ పెరుగుతుంది. అందుకే ఇప్పటి వరకూ సోషల్ మీడియా అకౌంట్ లేని వారు కూడా... ఓపెన్ చేస్తున్నారు.

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్(Pawan Kalyan) తన అభిమానులకు మరింత చేరువ కానున్నారు. ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా తన భావాలు పంచుకోవడం కోసం... సోషల్ మీడియాను(Social Media) ఉపయోగించబోతున్నారు.

ఇదివరకు స్టార్ హీరోలను చూడాంటే ఎంత కష్టం అయినా.. ఇంటికి వెళ్లేవారు.. కాని రాను రాను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వచ్చే వరకూ.. స్టార్స్ ఫ్యాన్స్ మధ్య దూరం తగ్గిపోయింది. ఏదైనా సరే నెట్టింట్లోనే(Internet) చూసుకుంటున్నారు. హీరోలు... హీరోయిన్లు ఎవరైనా సరే.. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటేనే.. సినిమాల్లో కూడా ఫాలోయింగ్ పెరుగుతుంది. అందుకే ఇప్పటి వరకూ సోషల్ మీడియా అకౌంట్ లేని వారు కూడా... ఓపెన్ చేస్తున్నారు.

ఇక తాజాగా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా సోషల్ మీడియా(Social Media) అకౌంట్ ఓపెన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు సినిమాల పరంగా.. అటు పొలిటికల్ మైలేజ్ కోసం పవర్ స్టార్ సోషల్ మీడియాను ఉపయోగించబోతున్నారు. అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ త్వరలో ఇన్ స్టాలో(Instagram) అభిమానులను పలకరించనున్నారు. ఇన్ స్టాగ్రాంలోకి పవన్ ఎంట్రీ ఇవ్వనున్నారని ఆయన సోదరుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు(Nagababu) అనౌన్స్ చేశారు. ఈమేరకు ఆయన తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు. అయితే, పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడనేదానిపై మాత్రం నాగబాబు క్లారిటీ ఇవ్వలేదు.

ఓవైపు వరుసగా సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ విశ్రాంతి తీసుకోకుండా ‘బ్రో’(Bro) సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పూర్తిచేసినట్లు సమాచారం.ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న బ్రో, ఓజి(OG), ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bagath Singh), హరిహర వీరమల్లు(Hari hara Veeramallu) సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Updated On 3 July 2023 8:20 AM GMT
Ehatv

Ehatv

Next Story