Mysterious Red Ring : ఆకాశంలో రెడ్ కలర్ రింగ్... ఇది గ్రహాంతరవాసుల వాహనం కాదు కదా!
గ్రహాంతరవాసులు (Alien) ఉన్నారో లేరో ఇప్పటి వరకు తెలియదు. ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉండకపోతారా అన్న బలమైన నమ్మకం. ఖగోళ శాస్ర్తవేత్తలు కూడా ఇదే విశ్వాసంతో ఉన్నారు. ఇటలీలో ఎరుపు రంగులో కనిపించిన ఓ వలయాన్ని చూసి ఇది గ్రహాంతరవాసుల వాహనమేనని (Alien spaceship)నమ్మేశారు చాలా మంది. ఆశ్చర్యపరిచే ఈ వింత వలయం మధ్య ఇటలీ(italy) లోని ఆల్ఫ్స్ పర్వతాల నుంచి అడ్రియాటిక్ సముద్రం వరకు ఆకాశంలో ఏకంగా 360 కిలోమీటర్ల పొడవునా విస్తరించి చూపరులను విస్మయానికి గురి చేసింది.
గ్రహాంతరవాసులు (Alien) ఉన్నారో లేరో ఇప్పటి వరకు తెలియదు. ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉండకపోతారా అన్న బలమైన నమ్మకం. ఖగోళ శాస్ర్తవేత్తలు కూడా ఇదే విశ్వాసంతో ఉన్నారు. ఇటలీలో ఎరుపు రంగులో కనిపించిన ఓ వలయాన్ని చూసి ఇది గ్రహాంతరవాసుల వాహనమేనని (Alien spaceship)నమ్మేశారు చాలా మంది. ఆశ్చర్యపరిచే ఈ వింత వలయం మధ్య ఇటలీ(italy) లోని ఆల్ఫ్స్ పర్వతాల నుంచి అడ్రియాటిక్ సముద్రం వరకు ఆకాశంలో ఏకంగా 360 కిలోమీటర్ల పొడవునా విస్తరించి చూపరులను విస్మయానికి గురి చేసింది. ఆ దృశ్యం చూసినవారు అచ్చంగా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్‌లోని సీన్లను చూసిన అనుభూతికి లోనయ్యారు. చాలా మంది అది ఏలియన్స్ వాహనమే అయి ఉంటుందని అనుకున్నారు కానీ సైంటిస్టులు మాత్రం అబ్బే అదేం కాదని కొట్టిపారేశారు. కాంతి ఉద్గార క్రమంలో అతి తక్కువ ఫ్రీక్వెన్సీతో కూడిన అవరోధాల కారణంగా ఇలాంటివి ఏర్పడుతాయని అన్నారు. వీటిని ఎల్వీ అని పిలుస్తారు. (Elve-emission of light and very low frequency perturbations due to electromagnetic pulse sources). ఈ ఎల్వీలు తుఫాను మేఘాలకుపై భాగాలలో విడుదలయ్యే అత్యధిక విద్యుదయస్కాంత శక్తి వల్ల ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎరుపు వలయానికి సెంట్రల్ ఇటలీకి దాదాపు 285 కిలోమీటర్లు దక్షిణాన చెలరేగిన తుఫాను సందర్భంగా చోటుచేసుకున్న శక్తిమంతమైన మెరుపు కారణమని తెలిపారు. ఈ ఫోటో తీసింది ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ వాల్తెయిర్ బినొటో(Valter Binotto). 2017లో ఆకాశంలో ఏర్పడే ఇలాంటి అద్భుతాలను తొలిసారిగా కెమెరాలో బంధించారట. అప్పట్నుంచి ఆయన ఇలాంటి చిత్రాలే తీస్తూ వస్తున్నారు.