నెలకు 50 వేల రూపాయలకుపైగానే సంపాదిస్తాడు.. చూడ్డానికి బాగానే ఉంటాడు. వయసు కూడా మీద పడలేదు.. పెళ్లీడు కుర్రాడే! అయినా అతడిని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పాపం ఆ యువకుడు బెంగేట్టుకున్నాడు. చాలా ఫీలవుతున్నాడు కూడా! మూడు పదులు ముంచుకొస్తున్నాయి.. ఇంకా పెళ్లికాకపోవడం బాధగా ఉందంటున్నాడు.. వెంటనే ప్రభుత్వం కన్య భాగ్య పథకాన్ని(Kanya Bhagya scheme) ప్రవేశపెట్టాలంటూ అధికారులకు వినతిపత్రం కూడా సమర్పించుకున్నాడు.

నెలకు 50 వేల రూపాయలకుపైగానే సంపాదిస్తాడు.. చూడ్డానికి బాగానే ఉంటాడు. వయసు కూడా మీద పడలేదు.. పెళ్లీడు కుర్రాడే! అయినా అతడిని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పాపం ఆ యువకుడు బెంగేట్టుకున్నాడు. చాలా ఫీలవుతున్నాడు కూడా! మూడు పదులు ముంచుకొస్తున్నాయి.. ఇంకా పెళ్లికాకపోవడం బాధగా ఉందంటున్నాడు.. వెంటనే ప్రభుత్వం కన్య భాగ్య పథకాన్ని(Kanya Bhagya scheme) ప్రవేశపెట్టాలంటూ అధికారులకు వినతిపత్రం కూడా సమర్పించుకున్నాడు. ఇదేదో బాగానే ఉందని అనుకుంటున్నారు పెళ్లి కాని ప్రసాద్‌లు.. విషయమేమింటే.. కర్ణాటకలోని(karanataka) గదగ్‌(gadag) జిల్లా ముండరిగి తాలూకా డంబరిగిలో ముత్తు హూగార్‌(Muthu Hoogar) అనే 28 ఏళ్ల యువకుడు ఉన్నాడు. వృత్తి కాంట్రాక్టర్‌. గురువారం ఆయన గ్రామ పంచాయతీ అధికారి దగ్గరకు వెళ్లి ప్రభుత్వం వెంటనే కన్య భాగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలంటూ ఓ వినతి పత్రం సమర్పించుకున్నాడు.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అన్న భాగ్య, గృహలక్ష్మీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అయిదు గ్యారంటీలను అమలు చేస్తున్నదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్‌(congress) సర్కార్‌ తన లాంటి యువకుల కోసం కన్య భాగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నారు ముత్తు హూగార్‌. పెళ్లి కాని యువకులకు పెళ్లయ్యే భాగ్యం కల్పించాలని విన్నవించుకుంటున్నాడు. తనకు నెలకు 50 వేల రూపాయలకు పైగా సంపాదన ఉందని, అందంగా ఉన్నానని, అయిఏ ప్రభుత్వ ఉద్యోగం లేదన్న కారణంగా అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని వాపోతున్నాడు.

30 ఏళ్ల వయసు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి కాకపోవడం బాధగా ఉందని, బంధువులు కూడా తనను పెళ్లి కాని హూగార్‌ అంటూ ఏడిపిస్తున్నారని ఆవేదన చెందుతున్నాడు. తనకు కులమతాలతో పట్టింపు లేదని, తనను అర్థం చేసుకునే అమ్మాయిని ఎవరినైనా పెళ్లి చేసుకుంటానని హూగార్‌ తెలిపాడు. ఇందుకు ప్రభుత్వం కన్య భాగ్య పథకం ప్రవేశపెడితేనే తనకు పెళ్లి కుదిరే అవకాశం ఉందంటున్నాడు. వినతి పత్రంలో పెళ్లి సంబంధించిన వివరాలు పొందుపరిచాడు. ఇదేదో కొత్త సమస్యలా ఉందని, ప్రభుత్వానికి వెంటనే చేరుతుందని చుట్టుపక్కల వారు అనుకుంటున్నారు. వినతి పత్రాన్ని తీసుకున్న అధికారి, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేస్తానని చెప్పారు. ముత్తు హూగార్‌ డిమాండ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..

Updated On 16 Jun 2023 2:36 AM GMT
Ehatv

Ehatv

Next Story