Digital Beggar : క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన... ఈ మోడ్రన్ బిచ్చగాడిని చూడండి...!
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బిచ్చగాళ్లు ఎక్కవయ్యారు. రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్లు, గుళ్లు, మందిరాల దగ్గర కూడా వీరి హడావుడి ఎక్కువగా ఉంటోంది. ఇచ్చేవాళ్లు ఇస్తుంటారు. చిల్లర లేదని కొందరు తప్పించుకుంటుంటారు. అయితే ముంబాయి(Mumbai)లోని ఓ లోకల్ ట్రైన్(Local Train)లో అడుక్కుంటున్న ఈ బిచ్చగాడి ముందు చిల్లర లేదని తప్పించుకోలేం. ఆ పప్పులేమీ అతడి దగ్గర ఉడకవు. సాధారణంగా బిక్షగాళ్లు పాత సంచినో, చిన్న బొచ్చుగిన్నెనో పట్టుకుని అడుక్కుంటుంటారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బిచ్చగాళ్లు ఎక్కవయ్యారు. రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్లు, గుళ్లు, మందిరాల దగ్గర కూడా వీరి హడావుడి ఎక్కువగా ఉంటోంది. ఇచ్చేవాళ్లు ఇస్తుంటారు. చిల్లర లేదని కొందరు తప్పించుకుంటుంటారు. అయితే ముంబాయి(Mumbai)లోని ఓ లోకల్ ట్రైన్(Local Train)లో అడుక్కుంటున్న ఈ బిచ్చగాడి ముందు చిల్లర లేదని తప్పించుకోలేం. ఆ పప్పులేమీ అతడి దగ్గర ఉడకవు. సాధారణంగా బిక్షగాళ్లు పాత సంచినో, చిన్న బొచ్చుగిన్నెనో పట్టుకుని అడుక్కుంటుంటారు. ఇతడేమో టెక్నాలజీని వాడుకుంటూ చేతిలో క్యూ ఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తున్నాడు. కాలంతో పాటు మనమూ మారాలని అనుకున్నాడు కాబోలు అందుకే క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ దానం చేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ముంబాయిలోని ఓ రద్దీ లోకల్ ట్రైన్‌లో ఇలా అడుక్కుంటున్న దృశ్యాలన్నింటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడో వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డిజిటల్ భిక్షగాడి తెలివికి నెటిజన్లు బిత్తరపోతున్నారు. ఇన్నేసి తెలివితేటలున్నవాడు ఇలా బిచ్చమెత్తుకోవడమేమిటి? చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చుగా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.