ప్రపంచంలోని  యూట్యూబర్ అత్యంత కుబేరుడు మిస్టర్ బీస్ట్(Mr Beast) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా రూ. 2.79 కోట్లు సంపాదించారు. దీంతో తనకు తెలియని 10 మంది ఫాలోవర్లకు(Followers) రూ. 20 లక్షల చొప్పున విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ లాంటి వారు ఎవరూ లేరు. అంతేకాకుండా అతను ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఎంతో కొంత విరాళంగా ఇస్తున్నారు. కొన్ని నెలల క్రితం వెయిటర్‌కు లగ్జరీ కారును(Car) బహుమతిగా ఇచ్చాడు. తాజాగా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులకు 25-25 వేల డాలర్లు అంటే దాదాపు 20-20 లక్షల రూపాయలు పంచినట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోని యూట్యూబర్ అత్యంత కుబేరుడు మిస్టర్ బీస్ట్(Mr Beast) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా రూ. 2.79 కోట్లు సంపాదించారు. దీంతో తనకు తెలియని 10 మంది ఫాలోవర్లకు(Followers) రూ. 20 లక్షల చొప్పున విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ లాంటి వారు ఎవరూ లేరు. అంతేకాకుండా అతను ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఎంతో కొంత విరాళంగా ఇస్తున్నారు. కొన్ని నెలల క్రితం వెయిటర్‌కు లగ్జరీ కారును(Car) బహుమతిగా ఇచ్చాడు. తాజాగా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులకు 25-25 వేల డాలర్లు అంటే దాదాపు 20-20 లక్షల రూపాయలు పంచినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో (Twitter) ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అతను ఈ డబ్బు సంపాదించాడు.

ప్రముఖ ఫేమస్‌ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ కొన్ని రోజుల క్రితం Xలో పాత వీడియోను(Video) పోస్ట్ చేయగా దానిని 20 కోట్లకు పైగా ప్రజలు వీక్షించారు. దీంతో బీస్ట్‌కు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. తనకు చైనా(China) మినహా ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్‌ ఉన్నారు, అందుకే చైనాలో కూడా తన వీడియోలను పోస్ట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. నేను చేసిన వీడియో గురించి చైనాలోని ప్రజలు ఏమనుకుంటున్నారో చూడాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. జనవరి 22న చైనా ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫారమ్ బిలిబిలిలో వీడియోను షేర్(Share) చేస్తూ మిస్టర్ బీస్ట్ ఇలా అన్నారు.

మిస్టర్ బీస్ట్ గతంలో కూడా తన అనుచరులకు ఇలాంటి ఛాలెంజ్‌లు ఇచ్చాడు. తన వీడియోలను ఎవరు షేర్‌ చేసి, లైక్స్‌ చేస్తున్నారో వారిలో 10 మందికి రూ.20 లక్షల చొప్పున పంపిస్తానని చెప్పడంతో దానిని షేర్‌ చేస్తూ, లైక్‌ చేస్తూ అతని ఫొటోలు పోటీలు పడుతున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్(Morning Post) నివేదిక ప్రకారం, ఈ వార్త చైనీస్ సోషల్ మీడియా సైట్ వివోలో(Vivo) కూడా చాలా వేగంగా వైరలైంది. చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా ఈ వీడియోను షేర్ చేశారు. మిస్టర్ బీస్ట్‌కు సంబంధించిన వీడియో 35 లక్షల కంటే ఎక్కువ సార్లు రీపోస్ట్(Repost) చేశారు. 21 లక్షలకు పైగా లైక్‌లను(Likes) పొందింది. ఆ తర్వాత తన ఫాలోవర్స్‌కు డబ్బు పంపించినా వారి పేర్లును బహిరంగ పర్చలేదు.

మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్(jimmy Donaldson). 25 సంవత్సరాల వయస్సులోనే ప్రపంచంలోనే ప్రసిద్ధ యూట్యూబర్‌గా మారాడు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న యూత్‌కు ఇతడు స్ఫూర్తిదాయకమయ్యాడు. కేవలం ఒక వీడియో ద్వారా లక్షలు సంపాదిస్తారు, కానీ వాటిని విరాళంగా ఇస్తారు. యూట్యూబ్‌లో అతని మెయిన్‌ ఛానెల్ ‘మిస్టర్ బీస్ట్’కు 23.40 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఇది కాకుండా బీస్ట్‌ మరో 4 యూట్యూబ్ ఛానెళ్లను నడుపుతున్నాడు. ‘మిస్టర్ బీస్ట్ 2’కు 3.63 కోట్ల మంది, ‘బీస్ట్ రియాక్ట్స్’కు 3.19 కోట్లు, ‘మిస్టర్ బీస్ట్ గేమింగ్’కు 4.14 కోట్లు, ‘బీస్ట్ ఫిలాంత్రోపీ’కు 2.12 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అ

Updated On 29 Jan 2024 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story