న్యూయార్క్ సిటీ (New york)లో సెరెండిపిటీ 3,(Serendipity 3′)అనే ఒక రిచ్ రెస్టారెంట్ లో , నేషనల్ గ్రిల్డ్ చీజ్ డే సందర్భంగా(National Grilled Cheese Day) (ఏప్రిల్ 12) కొంత కాలానికి మాత్రమే ఆ రెస్టారెంట్ స్పెషల్ శాండ్విచ్ 'క్వింటెస్సెన్షియల్ గ్రిల్డ్ చీజ్ '  '(Quintessential Grilled Cheese')శాండ్‌విచ్‌ను అందిస్తుంది . 2014 లోనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్‌విచ్‌గా 'క్వింటెస్సెన్షియల్ గ్రిల్డ్ చీజ్' శాండ్‌విచ్‌ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది . ఈ ప్రత్యేకమైన శాండ్‌విచ్ కొంతకాలం వారి మెనూలో లేదు.తిరిగి చీజ్ డే సందర్భంగా మళ్ళీ మెనూ లోకి ఈ శాండ్విచ్ ని యాడ్ చేసారు . కాని దీన్ని రుచి చూడాలి అనుకునేవాళ్లు 48 గంటల ముందు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది . ఇక ధర విషయానికి వస్తే $214 డాలర్లు .అంటే(రూ 17,500).ఈ డబ్బుతో ఒక స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేస్తుంది .

ఇక్కడ శాండ్విచ్ (Sand which)తినాలంటే మీ జేబుఖాళీ అవ్వాల్సిందే .. మీరు చూస్తుంది నిజమే .. శాండ్విచ్ అందరికి ఇష్టమైన స్నాక్ ఇంకా బ్రేక్ ఫాస్ట్ కూడా ..సాధారణంగా ఇంట్లో ఏదైనా సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినాలి అనుకునేవాళ్లకి బెస్ట్ ఆప్షన్ .అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా శాండ్విచ్ ఎక్కువ తింటారు . అలాగే బయట ఫుడ్ తినేవాళ్లు జంక్ ఫుడ్ ప్లేస్ లో కాస్త హెల్తీగా ఏమైనా తినాలి అనుకుంటే శాండ్విచ్ కి ఫస్ట్ ఇంపోర్టన్స్ ఇస్తారు . వెజ్ ,నాన్ వెజ్ రెండు రుచులలో వైరటీ శాండ్విచ్ లు చాలానే దొరుకుతాయి బయట మార్కెట్లో మహా అయితే 50 రూ ల నుండి 150 రూ కు మించి దీని ధర ఉండదు .కానీ న్యూయార్క్ లో ఒక రెస్టారెంట్ లో శాండ్విచ్ కాస్ట్ తెలిస్తే షాక్ అవుతారు .

న్యూయార్క్ సిటీ (New york)లో సెరెండిపిటీ 3,(Serendipity 3′)అనే ఒక రిచ్ రెస్టారెంట్ లో , నేషనల్ గ్రిల్డ్ చీజ్ డే సందర్భంగా(National Grilled Cheese Day) (ఏప్రిల్ 12) కొంత కాలానికి మాత్రమే ఆ రెస్టారెంట్ స్పెషల్ శాండ్విచ్ 'క్వింటెస్సెన్షియల్ గ్రిల్డ్ చీజ్ ' '(Quintessential Grilled Cheese')శాండ్‌విచ్‌ను అందిస్తుంది . 2014 లోనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్‌విచ్‌గా 'క్వింటెస్సెన్షియల్ గ్రిల్డ్ చీజ్' శాండ్‌విచ్‌ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది . ఈ ప్రత్యేకమైన శాండ్‌విచ్ కొంతకాలం వారి మెనూలో లేదు.తిరిగి చీజ్ డే సందర్భంగా మళ్ళీ మెనూ లోకి ఈ శాండ్విచ్ ని యాడ్ చేసారు . కాని దీన్ని రుచి చూడాలి అనుకునేవాళ్లు 48 గంటల ముందు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది . ఇక ధర విషయానికి వస్తే $214 డాలర్లు .అంటే(రూ 17,500).ఈ డబ్బుతో ఒక స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేస్తుంది .

శాండ్విచ్ కు ఇంత ధర అనుకుంటున్నారా !ఏం ప్రత్యేకత లేకపోతే అంత ధర ఎలా ఉంటుంది చెప్పండి . ఈ శాండ్విచ్ లో వాడే చీజ్ చాలా అరుదుగా లభించే ఆవు పాలతో తయారు చేయబడింది . శాండ్విచ్అరుదైన కాసియోకావాల్లో పొడోలికో చీజ్ ని ఉపయోగిస్తారు .ఈ ప్రత్యేకమైన పాలను ఇచ్చే ఆవులు కేవలం 25,000 మాత్రమే దక్షిణ ఇటలీ (south Italy)లో ఉన్నాయి.అవి మే మరియు జూన్‌లలో మాత్రమే పాలు ఇస్తాయి,ఆ పాలతో పాటు మరికొన్ని అరుదైన పదార్దాలను కలిపి చీజ్ తయారు చేయబడుతుంది . ఈ చీజ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన అరుదైన అలాగే ఖరీదైన చీజ్ లలో ఒకటి. డోమ్ పెరిగ్నాన్ షాంపైన్‌తో తయారు చేసిన ఫ్రెంచ్ పుల్‌మన్ షాంపైన్ బ్రెడ్‌ని ఉపయోగిస్తారు.అలాగే 23 కారట్ గోల్డ్ పూత కూడా ఉపయోగిస్తారు . అలాగే శాండ్విచ్ ని కాల్చటానికి ఉపయోగించే బట్టర్ కూడా ప్రత్యేకమైనది దీని ధర 8000రూ . సౌతాఫ్రికా లాబ్‌స్టర్(South African Lobster) ,టమేటా బిస్క్(Tomato Bisque) తో తయారు చేసిన డిప్ తో ఈ శాండ్విచ్ ని అందంగా సర్వ్ చేస్తారు . ఇన్ని అరుదైన పదార్దాలను వినియోగించటం వలనే దీని ధర కూడా ఎక్కువ ఉండటం జరిగింది . పైగా ఈ శాండ్విచ్ ని తినడానికి వేలల్లో జనాలు ఎగబడతారట .

Updated On 14 April 2023 5:05 AM GMT
rj sanju

rj sanju

Next Story