Monkey in Ayodhya Temple : అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశిస్తున్న కోతి...ఏం చేస్తుందంటే ?
ఓ కోతి అర్ధరాత్రి వేళ ఆలయానికి చేరుకుంటుంది. వచ్చే ముందు మధ్య మధ్యలో ఆగుతూ దేవుడికి దండాలు పెడుతూ వస్తుంది. ఆలయ మెట్లు ఎక్కి లోపలికి వెళ్లే ముందు.. సాష్టాంగ నమస్కారం చేస్తుంది.
హిందువులకు జంతువులలో కోతి అంటే ఎక్కువ సెంటిమెంట్ . ఆంజనేయ స్వామికి ప్రతిరూపంగా భావిస్తారు . ఇవి ఆలయాల పరిసరాల్లో కానీ ..ఇంటి ప్రాంగణంలో కానీ ఎక్కడ కనిపించిన భక్తితో ఆరాధిస్తారు. ఈ కోతులు ఒక్కొసారి అవి చేసే పనులకు ఆశ్చర్యమేస్తోంది. చిత్ర విచిత్రాలు చేస్తాయి .. ఒక్కొసారి బుద్ధిగా ఉంటూ ముద్దొచ్చేలా ఉంటాయి .. వాటికి గనుక కోపం తెప్పిస్తే ఇక అంతే ..పైన బడి రక్కేస్తాయి . అయితే కోతులు కొన్నిసార్లు ఆలయాల్లో దర్శనమిస్తూ అవి కూడా మనుష్యులాగే పూజలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి . అలాంటి సందర్భాల్లో పురాణాలు చెప్పేవి కొన్ని నిజమేమో అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ కోతి ప్రవర్తన చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. రోజూ ఆర్ధరాత్రి ఆలయంలోకి ఓ కోతి ప్రవేశిస్తుంది .. అడుగడుగుకు దండాలు పెడుతూ దేవుడిని భక్తితో మొక్కుకుంటోంది . చాలా కాలం క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
అయోధ్యలో చాలా కాలం క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి అర్ధరాత్రి వేళ ఆలయానికి చేరుకుంటుంది. వచ్చే ముందు మధ్య మధ్యలో ఆగుతూ దేవుడికి దండాలు పెడుతూ వస్తుంది. ఆలయ మెట్లు ఎక్కి లోపలికి వెళ్లే ముందు.. సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అయితే టెంపుల్ లో అదే సమయంలో అక్కడే ఉన్న కుక్క కోతిని గమనిస్తుంది.
అయినా ఇవేవీ పట్టించుకోని కోతి తన పని తాను చేసుకుంటూ పోతుంది ... లోపలికి వెళ్లి కొద్ది సేపు మౌనంగా కూర్చుంటుంది. కాసేపటి తర్వాత కుక్క అక్కడికి వచ్చి కోతిని చూసి గట్టిగా మొరుగుతుంది. అయినా భయపడని కోతి.. రివర్స్ లో ప్రతిఘటిస్తుంది. దీంతో భయపడిన కుక్క అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత పక్కనే ఉన్న దేవుడి విగ్రహానికి ఎదురుగా చాలా సేపు సాష్టాంగ నమస్కారం చేస్తూ.. ఆశీర్వదించమని అడుగుతున్నట్లుగా దేవున్ని వేడుకుంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.