అదో కారు.. దాని పేరు సిట్రోయెన్‌ 2 సీవీ(Citroen 2 CV).. మొన్నామధ్యన ఈ కారును వేలం వేశారు. ఓ వ్యక్తి ఈ కారుపై ముచ్చపడి, ఇష్టపడి 2.1 లక్ష యూరోలిచ్చి(Euros) కొనేసుకున్నాడు. మన కరెన్సీలో చెప్పాలంటే 1.85 కోట్ల రూపాయలన్నమాట. అంత ధర పోసి కొన్నాడంటే ఈ కారు ఏ మెర్సడీస్‌ బెంజో(Mercedes-Benz) అయి ఉంటుందనుకుంటున్నారు కదూ! కాదండి ..

అదో కారు.. దాని పేరు సిట్రోయెన్‌ 2 సీవీ(Citroen 2 CV).. మొన్నామధ్యన ఈ కారును వేలం వేశారు. ఓ వ్యక్తి ఈ కారుపై ముచ్చపడి, ఇష్టపడి 2.1 లక్ష యూరోలిచ్చి(Euros) కొనేసుకున్నాడు. మన కరెన్సీలో చెప్పాలంటే 1.85 కోట్ల రూపాయలన్నమాట. అంత ధర పోసి కొన్నాడంటే ఈ కారు ఏ మెర్సడీస్‌ బెంజో(Mercedes-Benz) అయి ఉంటుందనుకుంటున్నారు కదూ! కాదండి .. పూర్తిగా చెక్కతో తయారు చేసిన కారు. ఇది కేవలం ఒక యూనిట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఇలాంటి కారు ఒక్కట్టే ఉందన్నమాట. ఈ కారును మిచెల్‌ రాబిల్లార్డ్‌(Michel Robillard) అనే వ్యక్తి తయారుచేశారు.

చాసిస్‌ కోస పియర్‌, యాపిల్ చెట్టును(Apple Tree), బోనెట్‌ అండ్‌ బూట్‌ కోసం చెర్రీ చెట్టును(Cherry Tree) ఉపయోగించాడు. ఈ చెక్క కారును రూపొందించడానికి రాబిల్లార్డ్‌కు అయిదేళ్లు పట్టింది. 2011లో చెక్క కారును తయారుచేయాలన్న ఐడియా ఇతనికి వచ్చింది. సుమారు అయిదు వేల గంటలు కష్టపడి ఈ కారును తయారు చేశాడు. తనకు ముగ్గురు కొడుకులు ఉన్నారని, ఈ కారు తన కూతురు అని రాబిల్లార్డ్‌ చెప్పుకొచ్చాడు. త్వరలోనే సిట్రోయెన్ కంపెనీకి చెందిన మరో కారు 'సిట్రోయెన్ డిఎస్'ను కూడా చెక్కతో రూపొందించాలనుకున్నట్లు చెప్పాడు. చెక్కతో తయారు చేసిన ఈ కారుని గత ఆదివారం ఫ్రాన్స్ సెంట్రల్ సిటీ ఆఫ్ టూర్స్(France central city of tours) వేలం వేశారు. వేలం పాటలో జీన్‌ పాల్‌ ఫావాండ్‌ అనే వ్యక్తి ఈ కారును సొంతం చేసుకున్నాడు. ఈయన పారిస్‌ లోని మ్యూజియం ఆఫ్‌ వింటేజ్‌ పెయిర్‌ గ్రౌండ్‌ అట్రాక్షన్‌ యజమాని. కాబట్టే ఈ కారును కొన్నాడేమో! కారును ఆ మ్యూజియంలో సందర్శనకు ఉంచుతాడేమో!

Updated On 13 Jun 2023 12:15 AM GMT
Ehatv

Ehatv

Next Story