✕
మెనుస్ట్రువల్ కప్(Menstrual cup) ఎలా వాడాలో వైద్యులు(Doctors) వివరిస్తున్నారు. ఇది హైజీన్ ప్రొడక్ట్ అని, రబ్బర్ లేదా సిలికాన్ తయారు చేసే కప్‌ను పీరియడ్స్(Periods) టైంలో వాడుతారు. ప్యాడ్(Menstrual pad) లేదా బట్ట(Cloth) ఇలాంటివాటికంటే ఎక్కువ బ్లీడింగ్‌ను(Bleeding) ఈ కప్ కంట్రోల్ చేయగలదు. పీరియడ్ ఫ్లో ఉన్నవారు ఈ కప్‌ను 12 గంటల వరకు వాడొచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ కప్‌ను వాడాలంటే మీరు గైనకాలజిస్ట్‌ను(Gynecologist) సంప్రదిస్తే బాగుంటుందని అంటున్నారు. మీకు ఏ సైజ్ కప్ కావాలో కనుక్కొని దాని ప్రకారం వాటిని కొనుగోలుచేయాలంటున్నారు. మార్కెట్లో(Market) చాలా బ్రాండ్లలో ఇది లభిస్తుంది. స్మాల్, లార్జ్ సైజ్‌లో ఇవి అభిస్తున్నాయి.

x
manstural cups
-
- మీకు ఏ కప్ సరిపోతుందో తెలుసుకోవాలంటే.. మీ వయసు(Age), మీ సర్విక్స్ లెంత్(Cervix length) గురించి తెలుసుకోవాలంటున్నారు. మీ పీరియడ్ ఫ్లో, కప్ ఫ్లెక్సిబిలిటీ(Flexibility), కప్ కెపాసిటీ (Capicity), పెల్విక్ ఫ్లోర్ మజిల్స్(Pelvic floor muscles) ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో గమనించాలని సూచిస్తున్నారు.30 ఏళ్ల లోపు ఉన్నవారికి, నార్మల్ డెలివరీ(Normal delivery) కాని వారికి స్మాల్ కప్(Small cup) సజెస్ట్ చేస్తారు. 30 ఏళ్లకుపైగా ఉన్నవారికి, నార్మల్ డెలివరీ అయిన వారికి, బ్లీడింగ్ అధికంగా ఉన్నవారికి లార్జ్ కప్(Large cup) సజెస్ట్ చేస్తారు. అయితే తొలిసారి కప్ ఉపయోగించినప్పుడు కొంత అసౌకర్యంగా ఉంటుందట. ఈ కప్‌ను వజైనాలోకి (Vegina)పెట్టుకునేముందు నీటితో కడగడం లేదా ఏదైనా లూబ్రికెంట్(Lubricant) రాయడం చేస్తే సులభంగా ఇన్సర్ట్ అవుతుందంటున్నారు.చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, కప్ అంచును నీటితో లేదా వాటర్ బేస్డ్ లూబ్రికెంట్తో తడపాలని, అంచుపైకి వచ్చేలా ఈ కప్‌ను ఒక చేత్తో గట్టిగా మడిచి పట్టుకోవాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత స్లోగా కప్‌ను వజైనాలోకి ఇన్సర్ట్ చేయాలి. లోపలికి ప్రవేశపెట్టుకున్న తర్వాత దాన్ని రొటేట్(Rotate) చేయాలి. అప్పడొక ఎయిర్ టైట్ సీల్(Air tight seal) ఏర్పడడంతో లీక్ సమస్య ఉండదు.
-
- ఈ కప్‌ను సరిగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్(Feeling) ఉండదు. నార్మల్‌గానే ఉంటారని, మీ రొటీన్ యాక్టివిటీ(Routine Activity) అంతా చేసుకోవచ్చని చెప్తున్నారు. నడవడం(Walking), జంప్ చేయడం(Jumping), స్టెప్స్ ఎక్కడం, దిగడం చాలా సులభమని చెప్తున్నారు. ఒక వేళ దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలంటే డాక్టర్‌ను సంప్రదించాలని చెప్తున్నారు.
-
- బ్లీడింగ్ ఫ్లోని బట్టి ఈ కప్‌ను 6 నుంచి 12 గంటల వరకు ఉంచుకోవాలని సూచిస్తున్నారు. రాత్రంతా(Night) ఈ కప్‌ను ఉంచుకున్నా ఎలాంటి సమస్య ఉండదంటున్నారు.. కాకుంటే 12 గంటలలోపే తీసేయాలని చెప్తున్నారు. లేకుంటే లీకయ్యే(Leak) అవకాశముంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే బయటకు తీసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు(Precautions)పాటించాలంటున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, మీ బొటన వేలు(Thumb), చూపుడు వేలును(Index finger) వజైనాలోకి పెట్టి కప్ కింద పొడుగ్గా ఉండే భాగాన్ని పట్టుకొని బేస్ తగిలే వరకు నెమ్మదిగా లాగాలి. బేస్‌ని గట్టిగా నొక్కితే సీల్ ఓపెన్ అవుతుంది. స్లోగా కప్ కిందకి లాగి బయటకు తీయాలంటున్నారు.
-
- ఈ కప్‌ను శుభ్రంగా కడిగి(Wash), తుడిచిన తర్వాత మళ్లీ యూజ్ చేసుకోవచ్చంటున్నారు. రోజుకు రెండు సార్లయినా(Daily two times) మీరు కప్‌ను మార్చాలని, జాగ్రత్తగా వాడుకుంటే ఈ కప్ పదేళ్ల(Ten years) వరకు వాడుకోవచ్చని చెప్తున్నారు.
-
- అయితే కప్ వాడడం వల్ల ఖర్చు(Cost) తగ్గుతుందని, ప్యాడ్స్ కంటే ఈ కప్ సురక్షితమంటున్నారు(Safe). ప్యాడ్స్, న్యాప్కిన్స్ కంటే ఇది ఎక్కువగా బ్లడ్‌ను హోల్డ్ చేస్తుంది. కప్‌ను పెట్టుకోవడం, తీయడం కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చని కానీ సరిగా ఇన్సర్ట్ చేసుకోకుంటే కొన్ని సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉందంటున్నారు. చూశారుగా కప్స్ ఎలా వాడాలో.. అయితే ఏది వాడుతారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే గైనకాలజీని సంప్రదించాలని చెప్తున్నారు.

Ehatv
Next Story