✕
Meirivone Rocha Moraes : బొమ్మను మనువాడిన మహిళ.. ఇద్దరు పిల్లలు కూడా!
By EhatvPublished on 28 Nov 2023 6:47 AM GMT
దేవుళ్లను పెళ్లి(Marriage) చేసుకోవడం, తనను తాను మనువాడటం(Self Marriage), చెట్టునో కత్తినో కట్టుకోవడం వంటి సంఘటనలు చాలానే చూశాం! అప్పుడెప్పుడో జీవం లేని ఓ బొమ్మను(Doll) పెళ్లి చేసుకుందో మహిళ! ఇప్పుడామె స్టోరీ మళ్లీ వైరల్(Viral Story) అవుతోంది. ఆ కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

x
Meirivone Rocha Moraes
-
- దేవుళ్లను పెళ్లి(Marriage) చేసుకోవడం, తనను తాను మనువాడటం(Self Marriage), చెట్టునో కత్తినో కట్టుకోవడం వంటి సంఘటనలు చాలానే చూశాం! అప్పుడెప్పుడో జీవం లేని ఓ బొమ్మను(Doll) పెళ్లి చేసుకుందో మహిళ! ఇప్పుడామె స్టోరీ మళ్లీ వైరల్(Viral Story) అవుతోంది. ఆ కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
-
- బ్రెజిల్‌కు(Brazil) చెందిన (Meirivone Rocha Moraes) అనే 37 ఏళ్ల మహిళ రాగ్ డాల్(Rag doll) ప్రేమలో పడింది.
-
- రాగ్ డాల్ అంటే చేతితో తయారు(Hand made) చేసిన బొమ్మ. అమ్మగారింట్లో ఉన్నప్పుడు ఆ బొమ్మను ఆమె తయారు చేసింది. ఆ బొమ్మకు మార్సెలో(Marcelo) అని పేరు పెట్టుకుంది. తర్వాత ఆ బొమ్మను పీకల్దాక ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇదే విచిత్రమనుకుంటే ఈ జంటకు రీసెంట్గా ఓ బిడ్డ(Baby) పుట్టడం మహా వింత.
-
- ప్రస్తుతం వారి సంసార జీవితం హాయిగా, ఆనందంగా సాగుతోందట! ఆ బొమ్మ తనతో వాదనకు దిగదని, కొట్టడం తిట్టడం లాంటిది చేయదని మోరేస్ అంటోంది. తనకు మార్సెలో చాలా బాగా అర్థం చేసుకున్నదని చెబుతోంది. ఈ జంట ఇటీవల ఓ బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించింది.
-
- త్వరలో రెండో బిడ్డ(Second baby) కూడా రాబోతున్నదంటూ అనౌన్స్ చేసింది. పార్టీ కూడా చేసుకున్నారు. అన్నట్టు చెప్పలేదని అనుకునేరు.. పిల్లలు కూడా ర్యాగ్ బొమ్మలే! ప్రస్తుతం సోషల్ మీడియాలో మోరేస్, మార్సెలో పెళ్లి వార్త చక్కర్లు కొడుతోంది.

Ehatv
Next Story