Chiranjeevi New Luxury Car : మెగాస్టార్ గ్యారేజీలో మరో లగ్జరీ కారు.. ఫీచర్స్ ఏంటో తెలిస్తే... మతిపోవాల్సిందే..?
మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) మరో కొత్త కారుకి ఓనర్ అయ్యారు. ఆయన గ్యారేజీలో మరో లగ్జరీ కారు(New Luxury Car) వచ్చి చేరింది. ఆశ్చర్యపరిచే పీచర్స్ తో మతి పోగొట్టే సౌకర్యాలు కలిగి ఉన్న ఈ కారునురీసెంట్ గా రిజిస్టేషన్ కూడా చేయించారు చిరంజీవి. రీసెంట్ గా కొత్త కారుకు ఓనర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. కారంటే అల్లా టప్పా కారు కాదు.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ తో.. అద్భుతమైన సౌకర్యాలతో పాటు.. కాస్ట్ కూడా కాస్త ఘాటుగానే ఉంటుంది మరి. అంతే కాదు ఈకాస్ట్లీ కారుకు..
మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) మరో కొత్త కారుకి ఓనర్ అయ్యారు. ఆయన గ్యారేజీలో మరో లగ్జరీ కారు(New Luxury Car) వచ్చి చేరింది. ఆశ్చర్యపరిచే పీచర్స్ తో మతి పోగొట్టే సౌకర్యాలు కలిగి ఉన్న ఈ కారునురీసెంట్ గా రిజిస్టేషన్ కూడా చేయించారు చిరంజీవి.
రీసెంట్ గా కొత్త కారుకు ఓనర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. కారంటే అల్లా టప్పా కారు కాదు.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ తో.. అద్భుతమైన సౌకర్యాలతో పాటు.. కాస్ట్ కూడా కాస్త ఘాటుగానే ఉంటుంది మరి. అంతే కాదు ఈకాస్ట్లీ కారుకు.. చాలా కాస్ట్ పెట్టి ఫ్యాన్సీ నెంబర్ కూడా కొనేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక అసలు విషయానికి వస్తే..ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గ్యారేజీలో ఎన్నో కాస్ట్లీ కార్లు ఉన్నాయి. ఒక్కొక్క కారు అడ్వాన్స్ ఫీచర్స్ లో విలాసవంతంగా ఉన్నాయి. ఇకవాటిలోకి మరో అద్భుతమైన కారు వచ్చిచేరింది. ఆ అత్యాధునిక సౌకర్యాలకు పేరున్న టొయోటా వెల్‌ఫైర్(Toyota Vellfire) కారును రీసెంట్ గా కొనుగోలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ కార షోరూం ధర, లైఫ్ ట్యాక్సీ ధరలు కలుపుకుని మొత్తం సుమారు 1.9కోట్లు కాస్ట్ అయ్యిందని సమాచారం.
బర్నింగ్ బ్లాక్ కలర్ తో.. చూడగానే ఔరా అనేవిధంగా కనువిందు చేస్తోంది ఈకారు. ఇక ఈ కారుకు సబంధించిన రిజిస్టేషన్ పనులు కూడా పూర్తి చేశారు మెగాస్టార్. ఈ కారుకు ఆర్టీఏ అధికారులు ఆల్-1 నంబర్ కేటాయించారు. అంతే కాదు ఈ కారు ఫ్యాన్సీ నంబర్ కోసం మెగాస్టార్ దాదాపు 4.70లక్షలు ఖర్చు పెట్టారు. టీఎస్09 జీబీ1111 (TS09GB1111) నంబర్‌ను మెగాస్టార్ కైవసం చేసుకున్నారు. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి మెగాస్టార్ స్వయంగా వచ్చారు.
కొణిదెల చిరంజీవి పేరుతో కారును రిజిస్ట్రేషన్ చేశారు. ఆర్టీఓ రామచంద్రం దగ్గరుండి మెగాస్టార్ ఫొటో, డిజిటల్ సంతకం తదితర ప్రక్రియ పూర్తి చేయించారు. చిరంజీవి రాకతో.. ఖైరతాబాద్ ఆర్డీవో ఆఫీస్ పరిసరాలు సందడిగా మారాయి. చిరంజీవినిచూసి అక్కడి జనాలు ఎగబడ్డారు. మెగాస్టార్ రాకతో పరిసరాల్లో తగిన బద్రతను కూడా ఏర్పాట్ చేశారు పోలీసులు. ఇక ఈకారు ఫీచర్స్ విషయానికి వస్తే.. మతి పోయే సౌకర్యాలు ఈకారు సొంతం. టొయోటా నుంచి రిలీజ్ అయిన ఈ కారు.. అత్యాధునికమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఫీచర్లతో పాటు సెక్యూరిటీ కూడా కలిగి ఉంది. ఏడుగురు ప్రశాంతంగా కూర్చునే విధంగా సీట్టింగ కెపాసిటీ కలిగి ఉన్న ఈకారు.. మధ్య సీటు వీఐపీల కోసం అన్ని రకాలుగా తయారు చేయబడి ఉందిత. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్నవారు అందరికి రక్షణ కలిగేలా ఏడుఎయిర్ బ్యాగ్స్ ను కూడా కలిగి ఉంది ఈ కారు.
ట్విన్ సన్‌రూఫ్, త్రీజోన్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు.. 13 అంగుళాల స్క్రీన్స్ కూడా వచ్చింది. ఫ్రంట్‌లో రూట్ మ్యాప్ కోసం.. ఇతర అవసరాలకు.. పది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో పాటు కూడా ఉంది. ఆండ్రాయిడ్‌లో ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఈ వాహనం బర్నింగ్ బ్లాక్, వెల్‌ఫైర్ పెరల్ వైట్, గ్రాఫైట్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కారు మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ తో నడిచే ఈ కారు. లీటర్ కు 16.35 కిలో మీటర్లు వస్తుంది. ఇక వీటికి ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్ ఉండటం తో పాటు.. 2.5 పెట్రోల్ ఇంజిన్.. మరో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఉన్నాయి.