పెళ్లంటే నూరేళ్ల పంట. ఇద్దరు మనుషులు ఒక్కటవ్వడం కాదు, రెండు మనసుల కలయికే పెళ్లి. ఒకరికొకరు తోడుగా ఉండటమే వివాహం పరమావధి. అందుకే పెళ్లి విషయంలో పెద్దలు అంతగా ఆలోచిస్తారు. గియోవన్నీ విగ్లియోటో (Giovanni Vigliotto )అనే ఓ మగపుంగవుడికి మాత్రం పెళ్లికి ఏ మాత్రం ఆలోచించడు. చేసుకోవాలని అనిపిస్తే చటుక్కుమని చేసేసుకుంటాడు. ఇలా వందకు పైగానే పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంతమందిని చేసుకున్నా ఒక్కరికి కూడా విడాకులు ఇవ్వకపోవడం విచిత్రం. ఇది కూడా ఓ రకమైన గొప్పే కాబట్టి గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ (Guinness World Records) వారు ఇతడిని ప్రత్యేకంగా గుర్తించారు.

పెళ్లంటే నూరేళ్ల పంట. ఇద్దరు మనుషులు ఒక్కటవ్వడం కాదు, రెండు మనసుల కలయికే పెళ్లి. ఒకరికొకరు తోడుగా ఉండటమే వివాహం పరమావధి. అందుకే పెళ్లి విషయంలో పెద్దలు అంతగా ఆలోచిస్తారు. గియోవన్నీ విగ్లియోటో (Giovanni Vigliotto )అనే ఓ మగపుంగవుడికి మాత్రం పెళ్లికి ఏ మాత్రం ఆలోచించడు. చేసుకోవాలని అనిపిస్తే చటుక్కుమని చేసేసుకుంటాడు. ఇలా వందకు పైగానే పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంతమందిని చేసుకున్నా ఒక్కరికి కూడా విడాకులు ఇవ్వకపోవడం విచిత్రం. ఇది కూడా ఓ రకమైన గొప్పే కాబట్టి గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ (Guinness World Records) వారు ఇతడిని ప్రత్యేకంగా గుర్తించారు. అతడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు కూడా!

ఇప్పుడు మన స్టోరీలో ప్రధానపాత్రధారి అయిన గియోవన్నీ విగ్లియోటో (Giovanni Vigliotto )గురించి కాసింత తెలుసుకుందాం. ఏప్రిల్3, 1929న సిసిలీలోని సిరాకుసాలో పుట్టాడు. గియోవన్నీ విగ్లియోటో అన్నది నిజం పేరో అబద్ధం పేరో కూడా తెలియదు. ఎందుకంటే విచారణ సమయంలో తన పేరు నికోయ్‌ పెరుస్కో అని చెప్పాడితను. చాలా మంది ఫ్రెడ్‌ జిప్‌ అని కూడా అంటారట. 1949 నుంచి 1981 మధ్య ఇతడు కనీసం 105 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇతడెంత గొప్పోడంటే అతను భార్యలకు ఒకరి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఒక్క అమెరికాలోనే కాదు, 14 ఇతర దేశాలలోని అమ్మాయిలను కూడా ఇతడు పెళ్లి చేసుకున్నాడు. మొదట ఫేక్‌ డాక్యుమెంట్లు, నకిలీ పేర్లతో అమ్మాయిలను పరిచయం చేసుకునేవాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పేవాడు. అటు పిమ్మట వారికి ప్రజోజ్‌ చేసి పెళ్లి చేసుకునేవాడు. పెళ్లయిన కొన్ని రోజులకు తాను బయటెక్కడో జాబ్‌ చేస్తున్నానని, బతుకుతెరువు కోసం వెళ్లక తప్పదని చెప్పేవాడు. వెళ్లేటప్పుడు భార్యకు తెలియకుండా ఆమె విలువైన వస్తువులు, నగలు, నగదు తీసుకుని చెక్కేసేవాడు. ఇలా చాలా మందిని మోసం చేశాడు. చివరికి డిసెంబర్‌ 28, 1981న పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు. కోర్డు ఇతడికి 34 ఏళ్ల జైలు శిక్షతో పాటు 3,36,000 డాలర్ల జరిమానా విధించింది. 1991లో తన 61 ఏట మెదడు రక్తస్రావంతో విగ్లియోటో చనిపోయాడు.

Updated On 8 April 2023 7:04 AM GMT
Ehatv

Ehatv

Next Story