పశ్చిమ బెంగాల్ ఆలిపుర్ద్వార్‌ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఒక యువతీ చేసిన పనికి అక్కడ వాళ్లంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు . కుచ్‌బిహార్‌ జిల్లాకు చెందిన తుఫాన్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన మరో అమ్మాయి , ఆలిపుర్ద్వార్‌ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన యువతీ ఇద్దరు కాలేజీ లో చదువుతున్నారు.

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని మన పెద్దలు చెపుతున్నారు . కానీ నేటి యువత తీరు చూస్తుంటే అవన్నీ ఉత్తమాటలే కాబోలు అనిపిస్తాయి. యువత ఆలోచన ధోరణి మారింది .కట్టు బాట్లు సంప్రదాయాలుకు విలువ పోయింది .వ్యక్తిగత స్వేచ్చకు ప్రాధాన్యం ఎక్కువైంది. ఇష్టమైన వారిని వివాహం చేసుకొనే హక్కుని కలిపించింది సమాజం. కానీ లింగ బేధం లేకుండా జరిగే కొన్ని పెళ్లిళ్లు కూడా ఇతరుల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.కానీ వీటిని కూడా లీగలైజ్ చేస్తూ కోర్టులు ,ప్రభుత్వాలు సహజీవనం వంటి విషయాల్లో అనుకూలమైన తీర్పు ఇవ్వటంతో ఇక భయం ,సిగ్గు లేకుండా ఆడ మగ కాకూండా ఇద్దరు ఆడవాళ్లు కలిపి సహజీవనం ,పెళ్ళిళ్లు ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం లాంటి విపరీత పరిణామాలను ఎన్నింటినో చూడాల్సిన పరిస్థితి వస్తుంది . గతంలో ఇలాంటి ఉదంతాలు ఉన్న సమాజంపట్ల కాస్తూ కూస్తో భయంతోనో బయటపడేవారు కాదు .కానీ ఇప్పుడు అంత బహిరంగం బరితెగింపు కనపడుతున్నాయి .

తాజాగా పశ్చిమ బెంగాల్ ఆలిపుర్ద్వార్‌ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఒక యువతీ చేసిన పనికి అక్కడ వాళ్లంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు . కుచ్‌బిహార్‌ జిల్లాకు చెందిన తుఫాన్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన మరో అమ్మాయి , ఆలిపుర్ద్వార్‌ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన యువతీ ఇద్దరు కాలేజీ లో చదువుతున్నారు.రెండేళ్లక్రితం ఒక ఫుట్ బాల్ మ్యాచ్ లో అనుకోకుండా కలిసిన వీళ్లిద్దరు ప్రాణస్నేహితుల గా మారారు. స్నేహం కాస్త బంధం గా బలపడి ఆ తర్వాత ప్రేమ గా మారింది. ఇద్దరు స్వేచ్ఛగా హాయిగా హద్దులు లేకుండా తిరిగేవారు . వీళ్లిద్దరు వ్యవహారం పెద్దలకు వరకు వెళ్ళింది. ఇరు వైపు పెద్దలు ఐడెమ్ పోయేకాలం అంటూ ఇద్దర్ని మందలించారు. అయినా వాళ్ళు పెద్దల మాటలు ఖాతరు చేయలేదు . పెళ్లి చేస్తే అమ్మాయి దారిలోకి వస్తుంది అన్న ఆశతో తుఫాన్‌గంజ్‌ అమ్మాయి కి పెద్దలు మంచి యువకుడితో నెల క్రితం ఘనంగా వివాహం జరిపించారు .

పెళ్లి అయిన తరువాత తమ కూతురు మంచిగా మారి అత్తారింట్లో బుద్దిగా కాపురం చేసుకుంటుందనే అందరు అనుకున్నారు. కానీ పెళ్లి అయ్యి నెల తిరగకుండానే ఆమ్మాయి ఇంట్లో నుండి పారి పోయింది . పెళ్ళికి ముందు ప్రేమించిన తన స్నేహితురాలు కోసం వచ్చేసింది.భార్య కనిపించకపోవడం తో ఆ యువకుడు కంగారుపడి పోలీసులకు కంప్లైంట్ చేసాడు . ఇంట్లో వాళ్ళు కూడా వెతకటం మొదలు పెట్టారు . ఇద్దరు యువతులు కలిసి మల్దా ప్రాంతంలోని ఓ హోటల్‌లో రూమ్‌ రెంట్‌కి తీసుకుని.. అక్కడే కాపురం ఉంటున్నారు.సదరు హోటల్ సిబ్బందికి మొదట్లో ఎలాంటి అనుమానము రాకపోయినా తర్వాత వేళ్ళ ప్రవర్తన చూసి అనుమానంతో పోలీసులకు కబురు అందించారు . పోలీసులకు ఇలావీళ్ళ ఆచూకీ తెలిసి కౌన్సెలింగ్ ఇచ్చి పెద్దలు దగ్గరకు పంపే ప్రయత్నం చేయగా
ఆ యువతులు పెద్దలతో వెళ్ళటానికి ఇష్టం లేదని తెగేసి చెప్పారు.వారి బంధాన్ని ఒప్పుకుంటేనే వాళ్ళతో వెళ్ళేది , చావైనా బ్రతుకైనా ఇద్దరు కలిసే ఉంటాం అని చెప్పారు .

Updated On 11 March 2023 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story