Temple for Love Marriages : ఈ ఆలయంలో రోజుకో పెళ్లి.. ఇప్పటివరకు 5వేల ప్రేమ వివాహాలు
కరీంనగర్(Karimnagar) జిల్లాలోని తిమ్మాపూర్‌లో స్వయంభూగా వెలిసిన శ్రీతాపాల నరసింహస్వామి(Sritapala Narasimha swamy) ఆలయం ప్రేమ పెళ్లిళ్లకు ఆలయంగా మారింది. గత 23 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రేమపెళ్లిళ్లు జరిపిస్తున్నారు. పేదలు(Poor), ప్రేమ జంట వివాహం(Love Marriages) చేసుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. వివాహ బంధం నుంచి విడిపోయిన వారు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నవారు కూడా ఇక్కడికి వస్తుంటారని ఆలయ అర్చకులు తెలిపారు.

narasimha swamy

ప్రారంభంలో ఇక్కడ పెళ్లి చేసుకుంటే 200 రూపాయలు వసూలు చేసేవారు. క్రమక్రమంగా ఇక్కడ రుసుము రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగింది. ఒక్క కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఇతరత్రా జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెళ్లిళ్లు(Marriages) చేసకుంటున్నారు. ప్రతి నెల 25 నుంచి 30 పెళ్లిళ్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ఆలయంలో(Temple) ఎక్కువగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయని ఆలయ పూజారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ఆలయంలో 5 వేలకు(Five Thousand) పైగా పెళ్లిళ్లు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఈ తాపల లక్ష్మీనరసింహస్వామికి పేరుంది. 1989లో స్వయంభుగా వెలిసిన విగ్రహం ఆప్పటినుండి పూజలు అందుకుంటోంది. వివాహాలకు ఫేమస్ (Famous)కావడంతో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది.