Mango village In Kerala:ఉసిరికాయ నుండి కొబ్బరికాయ సైజు వరకు100 రకాల మామిడిపండ్లు ఇక్కడ దొరుకుతాయి .!
వేసవి కాలం(summer) వచ్చిందంటే చాలు అందరూ మామిడిపళ్ళ (mangoes)కోసం తెగ ఎదురు చూస్తూ ఉంటారు.. మామిడి పళ్ళు సీజన్ (mango season)మొదలైందో లేదో ఖరీదు మాట పక్కన పెట్టి కచ్చితంగా రుచి చూడాల్సిందే.. సాధారణంగా మామిడిపళ్ళల్లో చాలా రకాలైన కాయలను మనం చూస్తూ ఉంటాం. కానీ తినడానికి కొన్ని మాత్రమే రుచికరంగా ఉంటాయి.. ఇలా ఎక్కడెక్కడ నుంచో సాగు చేసిన మామిడి పండ్లను మార్కెట్లలో(markets) మనకు అమ్ముతూ ఉంటారు.. మామిడిపళ్ళల్లో చాలా రకాలైన జాతులు ఉంటాయి. అలాగే విభిన్న సైజుల్లో మామిడికాయలు మనకే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి..

వందకు పైగా వెరైటీ మామిడికాయలని పండించే గ్రామం ఒకటి మన దేశంలోనే(country) ఉంది. చిన్న ఉసిరికాయ సైజు నుంచి పెద్ద కొబ్బరికాయ సైజు వరకు అన్ని సైజుల్లో అన్ని రుచుల్లోనూ లభిస్తూ ఉంటాయి..
ఈ 102 రకాల మామిడి పండ్ల సాగును కురువక్కవుకు చెందిన 20 స్థానిక కుటుంబాలు సాగు చేస్తున్నాయి . ఈ ప్రాంతం కేరళలోని కన్నాపురం అని చిన్న పల్లెటూరు.. కేరళలోని (Kerala)కన్నూర్ (Kannur district)జిల్లాలోని కన్నాపురం (kannaporam)గ్రామంలో వందల రకాల మామిడి పండ్లను పండిస్తూ ఉంటారు.. అది కూడా తక్కువ ప్రదేశంలోనే ఈ మామిడి పండ్లు సాకు జరుగుతూ ఉండడం ఇక్కడ విశేషం.. కేవలం 3,230 చదరపు అడుగులు) ప్లాట్‌లో "382 చెట్లలో 102 రకాల మామిడి పండ్లను ఇక్కడ పండిస్తారు . కేరళ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు జూలై9july 2022) 2020లో కురువక్కవును(kuravakku) దేశీయ మామిడి వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది.
ఒక భూస్వామి 200 సంవత్సరాల నాటి అత్యంత తీపి మామిడిని పండించే వెల్లతన్ చెట్టును(vellathan tree) నరికివేయడంతో శైజు మచాతి అనే వ్యక్తి ఏ మామిడి సాగునీ మొదలు పెట్టాడు . మామిడి పెళ్లంటే ఎంతో ఇష్టం ఉన్న శైజు మచాతి చెట్టు ను నరికి వేయటం బాధించింది . ఆ చెట్టు తో అంటుకట్టడం ద్వారా మామిడి సాగు (mango farming)కి శ్రీకారం చుట్టాడు .తన ఇంటి పెరటిలోనే ఎన్నో మామిడి మొక్కల్ని పెంచాడు . వార్త పత్రికల్లో సైతం ఈ కథ ప్రచురితం అవ్వడం తో మరింత ఉత్సాహం తో శైజు మచాతి (sheju machati)మామిడి సాగుబడి కొనసాగించాడు . అరుదైన మామిడి (rare mangoes)రకాల సంరక్షణ వైపు అడుగులు వేశాడు. ఈ పనికి అతడి స్నేహితులు, వ్యవసాయ శాఖ అధికారులు సహకారం అందించారు.అలాగే చుట్టూ పక్కల వాళ్ళు కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకొని వారి పెరటిలో(home garden) మామిడి మొక్కల్ని పెంచడం(plants growing) మొదలు పెట్టారు . వాటిని సంరక్షించేందుకు తమ వంతు కృషి చేయడం మొదలెట్టారు.
ఏటా మే (may)నెల తొలి ఆదివారం ఇక్కడ 'మ్యాంగో ఫెస్ట్' (mango feast)నిర్వహిస్తున్నారు. అన్ని రకాల మామిడి పండ్లు, వాటితో వివిధ వంటకాలు తయారు చేసి ఆ రోజున ప్రదర్శిస్తారు. ఆ సందడిని చూసేందుకు ప్రముఖులు, చుట్టుపక్కల గ్రామస్థులు కూడా తరలివస్తుంటారు. అరుదైన మామిడి పండ్లు9mangoes) దొరికే ఊరిగా ప్రసిద్ధి పొందింది ఈ గ్రామం .అంతే కాకుండా చాల మంది వ్యవసాయ శాఖ(farming department) విద్యార్థులు ఇక్కడకు వచ్చి నెల సారం ,అంటూ కట్టడం వంటి పద్ధతులతులపై అవగాహనా ప్రత్యక్షంగా చూపిస్తుంటారు . నిపుణులు ఇక్కడ దొరికే మామిడిరకాలను వేరే ప్రాంతాల్లో కూడా సాగుబడి చేయించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు .