మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం(Mangalagiri Lakshmi Narasimha Temple) ఎంతో పురాతనమైనది. పానకాల నరసింహస్వామిగా భక్తులు కొలుచుకునే ఆ ఆలయ ప్రాశస్త్యం గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు కానీ ఆలయం సమీపంలో ఉన్న పెద్ద కోనేరు(Temple Tank) గురించి మాత్రం ఇప్పుడు చెప్పుకుని తీరాలి. చీకటి కోనేరుగా(chikati konneru) పిల్చుకునే ఈ పుష్కరణి కొన్ని దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంది.

సొరంగం ఎక్కడ వరకూ ఉంది? ఎందుకు తవ్వించారు?

మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం(Mangalagiri Lakshmi Narasimha Temple) ఎంతో పురాతనమైనది. పానకాల నరసింహస్వామిగా భక్తులు కొలుచుకునే ఆ ఆలయ ప్రాశస్త్యం గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు కానీ ఆలయం సమీపంలో ఉన్న పెద్ద కోనేరు(Temple Tank) గురించి మాత్రం ఇప్పుడు చెప్పుకుని తీరాలి. చీకటి కోనేరుగా(chikati konneru) పిల్చుకునే ఈ పుష్కరణి కొన్ని దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంది. మళ్లీ ఈ కోనేరును అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఆరు నెలల కిందట పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.

అయితే అడుగు అడుగునా ఎన్నో ఆసక్తికరమైన కట్టడాలు వెలుగు చూస్తున్నాయి. ఆ భారీ కోనేరులో ఎన్నో వింతలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ భారీ సొరంగం(Tunnel) బయటపడింది. ఆ కోనేరు అడుగున దాగి ఉన్న సొరంగం రహస్యమేమిటి? అది ఎక్కడి వరకు ఉంది? ఎవరు , ఎందుకు తవ్వించారు? ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనే ప్రయత్నంలో పడ్డారు ఆర్కియాలజిస్టులు.. చరిత్ర పరిశోధకులు..
ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ఎత్తయిన రాజగోపురం ఉన్న ఆలయంగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రసిద్ధిపొందింది. ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో(Dwaparayugam) పాండవులు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది.

ఈ ప్రాచీన ఆలయం శ్రీ కృష్ణ దేవరాయల(Shri Krishna devarayulu) కాలంలో ఎంతో అభివృద్ధి చెందిందని చారిత్రిక ఆధారాల వల్ల తెలుస్తోంది. అలాగే సదాశివరాయల కాలంలో ఆలయ పరిసరాల రూపురేఖలు మొత్తం మారాయట. ఆయన మేనల్లుడు రాజయ్య కూడా ఆలయ అభివృద్ధిలో ఎంతో తోడ్పాటును అందించాడు. ఆలయానికి దక్షిణ భాగంలో పెద్ద కోనేరును నిర్మించింది రాజయ్యనే! 464 ఏళ్ల కిందట నిర్మించిన ఈ కోనేరు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. నిజానికి 1970 వరకు ఈ కోనేరులో స్వామి వారి తెప్పోత్సవం ఘనంగా, కన్నుల పండుగగా జరిగేది.

అప్పట్లో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఈ పుష్కరిణిలోనే స్నానమాచరించేవారు. కాల క్రమేణా ఇది నిరాదరణకు గురయ్యింది. నెమ్మదిగా శిథిలావస్థకు చేరుకోవడం మొదలయ్యింది. తర్వాతి కాలంలో ఇది డంపింగ్‌ యార్డ్‌గా మారింది. అసలు ఇక్కడ ఓ కోనేరు ఉందన్న సంగతినే జనం మర్చిపోయారు. ఆలయ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా కోనేటి నిర్మాణాలు కొన్ని కూలిపోయాయి. 1832లో వచ్చిన భయంకరమైన కరువు కారణంగా కోనేరు పూర్తిగా ఎండిపోయిందట.

అప్పుడు కోనేటిలో కర్ణాటకకు చెందిన పది వేల తుపాకులు, అనేక ఫిరంగి గుండ్లు లభించాయట. ఈ విషయం బ్రిటిష్‌ రికార్డులలో ఉంది. ఇంతటి చారిత్రక కట్టడం మరుగునపడిపోవడం చాలామందిని బాధించింది. 1994లో కొందరు ఔత్సాహికులు ఓఎన్‌జీసీ సాయంతో కోనేటిని శుభ్రం చేయడానికి ప్రయత్నించారు. అయితే నీరు పెద్ద ఎత్తున చేరుతుండటంతో ఆ ప్రయత్న ఫలించలేదు. ఇప్పుడు మరోసారి ఆ బృహద్‌కార్యాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆల్ల రామకృష్ణారెడ్డి ఆలయ అధికారులతో కలిసి చేపట్టారు.

ఆరు నెలల కిందట కోనేరు పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఒక్కో అడుగు నీరు తోడే కొద్దీ ఒక్కో చారిత్రక కట్టడం బయటపడుతోంది. మొదట అయిదు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహంతో కూడిన ఆలయం బయటపడింది. ఆలయం ఎదుట ధ్వజస్తంభం కూడా ఉంది. ఇప్పుడు ఆ ఆలయానికి మరమత్తులు జరుగుతున్నాయి. ఆంజనేయస్వామి నిత్యపూజలు అందుకుంటున్నాడు. తర్వాత శ్రీ వేంకటేశ్వరస్వామి పంచలోహ విగ్రహం బయటపడింది. మరికొన్ని రోజులకు వినాయకుడి శిలా విగ్రహం వెలుగు చూసింది. తూర్పు మెట్లపై అక్కడక్కడ శివలింగాలు దర్శనమిచ్చాయి. ఇవి కూడా ఇప్పుడు పూజలు అందుకుంటున్నాయి.

తాజాగా ఓ భారీ సొరంగం బయటపడింది. సుమారు 120 అడుగుల లోతులో ఉన్న ఈ సొరంగం అయిదు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ సొరంగం చేబ్రోలు చతుర్ముఖ బ్రహ్మ ఆలయ వరకు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. ఈ బ్రహ్మ గుడి కూడా కోనేరులోనే ఉండటం గమనార్హం. ఇప్పుడు సొరంగంలోని బురదను తొలగిస్తున్నారు. బురద పూర్తిగా తొలగిపోయిన తర్వాత సొరంగంలోపల ఏముంది? సొరంగం ఎక్కడి వరకు ఉంది? అన్న విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సర్వసాధారణంగా కోనేరులన్నీ చతుర్భజ ఆకారంలోనో, షడ్భుజ ఆకారంలోనో, అష్టభుజి ఆకారంలోనో ఉంటాయి. ఈ కోనేరు మాత్రం శ్రీచక్రం ఆకారంలో ఉండటం విశేషం.

Updated On 19 Jun 2023 12:02 AM GMT
Ehatv

Ehatv

Next Story