SI BV varsha : బదలీ అవుతూ బాధ్యతలను కూతురుకు అప్పగించిన తండ్రి
కొన్ని అనుభూతులు కోట్లు కుమ్మరించినా దొరకవు. ఇలాంటి మధురానుభూతే కర్ణాటకలోని(Karnataka) ఓ తండ్రి కూతుళ్లకు దక్కింది. మండ్య సెంట్రల్ పోలీసు స్టేషన్‌లో(Mandya Central Police Station) ఎస్‌ఐ బి.ఎస్.వెంకటేశ్(SI BS Venkatesh) బదిలీ అయ్యారు. బదిలీ అవుతున్నప్పుడు తన బాధ్యతలను(Responsibilities) ఎవరికో ఒకరికి అప్పగించాలి కదా!ఆయన స్థానంలో కొత్త ఎస్‌ఐ బి.వి.వర్ష(SI BV Varsha) నియమితులయ్యారు.

SI BV varsha
కొన్ని అనుభూతులు కోట్లు కుమ్మరించినా దొరకవు. ఇలాంటి మధురానుభూతే కర్ణాటకలోని(Karnataka) ఓ తండ్రి కూతుళ్లకు దక్కింది. మండ్య సెంట్రల్ పోలీసు స్టేషన్‌లో(Mandya Central Police Station) ఎస్‌ఐ బి.ఎస్.వెంకటేశ్(SI BS Venkatesh) బదిలీ అయ్యారు. బదిలీ అవుతున్నప్పుడు తన బాధ్యతలను(Responsibilities) ఎవరికో ఒకరికి అప్పగించాలి కదా!ఆయన స్థానంలో కొత్త ఎస్‌ఐ బి.వి.వర్ష(SI BV Varsha) నియమితులయ్యారు. ఆమెకు బాధ్యతలను అప్పగించి వెళ్లిపోయారు. ఇంతకీ వర్ష ఎవరో కాదు.. వెంకటేశ్ కన్నకూతురే(Daughter)! ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్(PG In Economics) చేసిన వర్ష 2022 బ్యాచ్‌లో కలబురిగిలో శిక్షణ తీసుకున్నారు. ట్రైనీ ఎస్‌ఐగా మండ్య సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లోనే పని చేశారు. తొలి పోస్టింగ్ కూడా మండ్యలోనే జరగడం విశేషం. ఇది కూడా తండ్రి పని చేసి బదిలీ అయిన మండ్య సెంట్రల్ పోలీస్‌స్టేషన్‌కే కావడం మరింత విశేషం. బుధవారం తన తండ్రి వెంకటేశ్ నుంచి వర్ష ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పుడామె పూర్తి స్థాయి ఎస్‌ఐ. ఈ సందర్భంగా తండ్రీ కూతురు స్టేషన్‌లోని సిబ్బందికి స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు. ఆ మధుర జ్ఞాపకాన్ని గుండెల్లో పదిలపర్చుకున్నారు.
