Manchu Manoj Viral Post : ప్రేమించు..ప్రేమను పంచు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్...
మంచువారి ఫ్యామిలీలో ప్రస్తుతం నడుస్తున్నతుఫాను గురించి అందరికి తెలిసిందే. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచుమనోజ్(Manchu Manoj) ల మధ్య వార్ హీట్ పెరుగుతుంటే.. దాన్ని కవర్ చేయడానికి మెహన్ బాబు, మంచు లక్ష్మీ(ManchuLakshmi)పడుతున్నతంటాల గురించి కూడా చూస్తూనే ఉన్నాం. చాలా ఏళ్ళుగా వీరి మధ్య విభేదాలు ఉన్నా.. మనోజ్ పెళ్లి టైమ్ లో.. ఇవి తారా స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. దాంతో ఇండస్ట్రీలో మంచు వారి హడావిడి ఎక్కువైపోయిందీ మధ్య.
మంచువారి ఫ్యామిలీలో ప్రస్తుతం నడుస్తున్నతుఫాను గురించి అందరికి తెలిసిందే. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచుమనోజ్(Manchu Manoj) ల మధ్య వార్ హీట్ పెరుగుతుంటే.. దాన్ని కవర్ చేయడానికి మెహన్ బాబు, మంచు లక్ష్మీ(Manchu Lakshmi)పడుతున్నతంటాల గురించి కూడా చూస్తూనే ఉన్నాం. చాలా ఏళ్ళుగా వీరి మధ్య విభేదాలు ఉన్నా మనోజ్ పెళ్లి టైమ్ లో.. ఇవి తారా స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. దాంతో ఇండస్ట్రీలో మంచు వారి హడావిడి ఎక్కువైపోయిందీ మధ్య.
అయితే ఈ వివాదంలో తాలో మాట మాట్లాడుతున్నారు.. తలో పోస్ట్ పెడుతూ.. సోషల్ మీడియాలో నెటిజన్లను కూడా కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నారు. ఈక్రమంలో గొడవను కవర్ చేస్తూ.. ఇదంతా రియాల్టీ షో అని మంచు విష్ణు( Manchu Vishnu) కవర్ చేసేప్రయత్నం చేశాడు. కాని అది వర్కౌట్ అవ్వలేదని తెలుస్తోంది. ఈక్రమంలోనే వీరి మధ్య నుంచి ఇంకెలాంటి న్యూస్ బయటకు వస్తుందా.. అని చూస్తున్న క్రమంలో.. మంచు మనోజ్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతోందిత.
తాజాగా మనోజ్(Manchu Manoj) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ స్టోరీ శేర్ చేశాడు. భూమా మౌనిక(Bhuma Mounika)ను రెండో పెళ్ళి చేసుకున్నాడు మనోజ్. ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడం విశేషం. అయితే ఈ పెట్టి మంచువారి ఫ్యామిలీలో తుఫాన్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో వీరి పెళ్ళి జరిగి నెల రోజులు అవుతోంది. మార్చ్ 3న ఈజంట మూడు ముళ్ళతో ఒక్కటి అయ్యారు. ఈ సందర్భంగా మనోజ్(Manchu Manoj) పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరి పెళ్లి అయ్యి నెల పూర్తీ కావడంతో, ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక వీడియో షేర్ చేశాడు.
ఆ వీడియోలో మనోజ్(Manchu Manoj) అండ్ మౌనిక నడుచుకుంటూ వస్తుంటే, వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ప్రియా ప్రియా చంపోదే సాంగ్ వస్తుంది. ఇక ఈ వీడియోకి.. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా వీరిద్దరిది ప్రేమ వివాహం అయినప్పటికీ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. ఈ పెళ్లి మంచు విష్ణు( Manchu Vishnu)కి ఇష్టం లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే పెళ్లిలో ఎక్కడా మంచు విష్ణు కనిపించలేదని మాటలు వస్తున్నాయి.