Podcast Takes a Wild Turn : పోడ్కాస్ట్కు వచ్చిన కొండ చిలువ..!
కోవిడ్-19 (Covid-19_ తర్వాత వర్క్ ఫ్రం (Work From Home) హోం కల్చర్ ఎక్కువైన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే కార్యాలయాలకు రావాలని కొన్ని కంపెనీలకు తమ ఉద్యోగులను (Employees) కోరుతున్నాయి. ఇందుకు కొందరు ఎంప్లాయీస్ నిరాకరిస్తున్నారు. ఎంప్లాయీస్‌పై ఒత్తిడి చేస్తే వారు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉన్న కంపెనీలకు మారుతున్నారని.. ఇంటి నుంచే పనిచేయడం వల్ల కంపెనీలకే లాభమని పలు కంపెనీలు భావిస్తున్నాయి.
కోవిడ్-19 (Covid-19_ తర్వాత వర్క్ ఫ్రం (Work From Home) హోం కల్చర్ ఎక్కువైన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే కార్యాలయాలకు రావాలని కొన్ని కంపెనీలకు తమ ఉద్యోగులను (Employees) కోరుతున్నాయి. ఇందుకు కొందరు ఎంప్లాయీస్ నిరాకరిస్తున్నారు. ఎంప్లాయీస్‌పై ఒత్తిడి చేస్తే వారు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉన్న కంపెనీలకు మారుతున్నారని.. ఇంటి నుంచే పనిచేయడం వల్ల కంపెనీలకే లాభమని పలు కంపెనీలు భావిస్తున్నాయి. ఉద్యోగులకు కలిగించే రవణా (Transport), ఆఫీస్‌లో ఇతర సౌకర్యాలు (Facilities) ఇవన్నీ కంపెనీలకు మిగిలిపోయినట్లేనని తద్వారా పలు కంపెనీలు లాభాల బాట పడుతున్నాయని మార్కెట్ వర్గాల విశ్లేషణ.
అయితే తాజాగా ఆస్ట్రేలియా (Australia)లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పోడ్కాస్ట్ మీటింగ్‌లో ఓ ఉద్యోగి ఉత్సాహంగా పాల్గొంటుండగా అనుకోని అతిథి ఆ మీటింగ్‌కు వచ్చింది. ఆండ్రూవార్డ్ ( Andrew Ward) మాట్లాడుతుండగా వెనుక ఉన్న పైకప్పు నుంచి కొండ చిలువ ప్రవేశించింది. సిడ్నీలోని స్ట్రాటజీ గ్రూప్ నిర్మించిన పోడ్కాస్ట్ మీటింగ్ మధ్యలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అండ్రూ వార్డ్ అనే వ్యక్తి మాట్లాడుతుండగా ఈ కొండ చిలువ కనిపించింది. ఈ విషయాన్ని తన కొలీగ్స్ వెంటనే అతనికి చెప్పడంతో వెనక్కి చూసి వార్డ్ ఆశ్చర్యపోయాడు. ఎలాంటి ఆందోళన పడకుండా తన మీటింగ్‌ను కొనసాగించాడు. అయితే ఈ మీటింగ్‌లో పర్యావరణంపై చర్చ నడుస్తుండగా ఈ పాము కనిపించింది. ఇది కార్పైట్ పైథాన్ (Carpet python)అని, పెద్దగా భయపడాల్సిన పనిలేదని అన్నారట. ఆ కొండచిలువ కూడా తన పనితాను చేసుకుంటూ వెళ్లిపోయింది. నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.