నిప్పుతో చెలగాటం ముప్పు తెస్తుందని పెద్దలు చాలా సార్లు చాలా రకాలుగా చెబుతూ వస్తున్నారు. కొందరు వింటేగా! ఫైర్‌తో గేమ్స్ ఆడుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాగే ఓ వ్యక్తి నిప్పుతో స్టంట్స్ చేద్దామనుకున్నాడు. అసలేం జరిగిందో మూడు మక్కల్లో చెబుతాను. చలికాచుకునేందుకు కొందరు మంట వేసుకున్నారు. చలి మంట వేసుకునప్పుడు ఆ పనే చేయాలి కదా! ఓ తుంటరి మాత్రం మంటల పై నుంచి అటు ఇటు దూకడం మొదలెట్టాడు. ఈ క్రమంలో అతడి షర్టుకు […]
నిప్పుతో చెలగాటం ముప్పు తెస్తుందని పెద్దలు చాలా సార్లు చాలా రకాలుగా చెబుతూ వస్తున్నారు. కొందరు వింటేగా! ఫైర్‌తో గేమ్స్ ఆడుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాగే ఓ వ్యక్తి నిప్పుతో స్టంట్స్ చేద్దామనుకున్నాడు. అసలేం జరిగిందో మూడు మక్కల్లో చెబుతాను. చలికాచుకునేందుకు కొందరు మంట వేసుకున్నారు. చలి మంట వేసుకునప్పుడు ఆ పనే చేయాలి కదా! ఓ తుంటరి మాత్రం మంటల పై నుంచి అటు ఇటు దూకడం మొదలెట్టాడు. ఈ క్రమంలో అతడి షర్టుకు మంటలు అంటుకున్నాయి. మంటల ధాటికి తట్టుకోలేక ఆ యువకుడు పరుగులు తీశాడు. షర్ట్ విప్పేసి పడేశాడు. అప్పటికే ప్యాంట్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. నేల మీద కూర్చున్నా మంటలు ఆగలేదు. మళ్లీ పరుగులు పెట్టాడు. అక్కడే ఉన్న చిన్న నీటి మడుగులో దూకేశాడు. దాంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. నెటిజన్లు ఆ యువకుడిని చెడామడా తిట్టిపోస్తున్నారు. కోరి ప్రమాదాలు తెచ్చుకోవద్దని హెచ్చరికతో కూడిన సలహా ఇస్తున్నారు.