ప్రస్తుత ఫ్యాషన్ కాలంలో వస్తున్న మార్పులు మనుషుల జీవనవిధానంలో కొన్ని అనుకోని మార్పులు తీసువస్తున్నాయి . సాధారణం గా ఇదివరకు కంటి సమస్యలు ఉన్నవారు మాత్రమే కళ్లద్దాలు ధరించేవారు ..క్రమేపి అది ఫాషన్ గా మారింది. చాల మంది లుక్ కోసం కళ్లద్దాలు ధరించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కళ్ళజోడు ఫ్రేమ్స్ డిజైన్స్ అనేవి ట్రేండింగ్ గా మారాయి. వాటిని కూడా సవరిస్తూ కంటి సమస్యలు ఉన్నవారికి కళ్లద్దాలు కి బదులు కాంటాక్జ్ లెన్స్ ని అందుబాటులో […]

ప్రస్తుత ఫ్యాషన్ కాలంలో వస్తున్న మార్పులు మనుషుల జీవనవిధానంలో కొన్ని అనుకోని మార్పులు తీసువస్తున్నాయి . సాధారణం గా ఇదివరకు కంటి సమస్యలు ఉన్నవారు మాత్రమే కళ్లద్దాలు ధరించేవారు ..క్రమేపి అది ఫాషన్ గా మారింది. చాల మంది లుక్ కోసం కళ్లద్దాలు ధరించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కళ్ళజోడు ఫ్రేమ్స్ డిజైన్స్ అనేవి ట్రేండింగ్ గా మారాయి. వాటిని కూడా సవరిస్తూ కంటి సమస్యలు ఉన్నవారికి కళ్లద్దాలు కి బదులు కాంటాక్జ్ లెన్స్ ని అందుబాటులో కి తీసుకు వచ్చారు . వివిధ రంగుల్లో లభిస్తున్న ఈ కాంటాక్ట్ లెన్స్ ని వాడటం యూత్ కి ఒక ఫాషన్ గా మారింది . వీటిని సరైన పద్దతిలో వినియోగిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు ..కానీ నిర్లక్ష్యం చేస్తే అనుకోని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సరిగ్గా అలాంటి అనుకోని ప్రమాదం వలన ఒక కుర్రాడు ఏకం గా తన కంటి చూపునే కోల్పాయాడు .. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన మైక్ క్రుమోల్జ్ అనే యువకుడు కాంటాక్ట్ లెన్స్ గత 7 సంవత్సరాలుగా వాడుతున్నాడు.. ఎన్నో సార్లు వీటిని తీయకుండానే నిద్రించేవాడు. అదే ఇప్పుడు అతని కొంప ముంచింది . ఆలా కాంటాక్ట్ లెన్స్ తీయకుండా నిద్రించటం వలన అతని కుడి కంటి లో ఏర్పడిన బాక్టీరియా అతని కంటిని తినేసాయి అని డాక్టర్స్ చెప్పటంతో షాక్
కి గురయ్యాడు ఆ యువకుడు. గతంలో కాంటాక్ట్ లెన్స్ తీయకుండా ఉన్నపుడు అతని కళ్ళలో మంటలు,ఎర్రబడటం లాంటి సమస్యలు వచ్చిన వాటిని పట్టించు కోలేదు .. చివరికి ఏకం గా కంటినీ పోగొట్టు కున్నాడు.

కాంటాక్ట్ లెన్స్ వలన అనేక దుష్ప్రయోజనాలు ఉన్నాయని వైదనిపుణులు హెచ్చరిస్తున్నారు . అతిగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించటం వల్ల కంటిలో కార్నియా దెబ్బతింటుంది కంటి ఇన్ఫెక్షన్స్ అనే వి వస్తాయి .. ఇవి ఎక్కువ అయితే కంటి చూపు కోల్పోయే అవకాశాలు ఉంటాయని సూచించారు ఆరోగ్య నిపుణులు ..దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ సంఘటన .

Updated On 25 Feb 2023 7:49 AM GMT
Ehatv

Ehatv

Next Story