ఓ లేడి జర్నలిస్టు(Female Reporte) లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తోంది. ఆ దారంట నడుచుకుంటూ వస్తున్న ఓ వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. అసభ్యంగా తాకాడు. ఈ ఘటన స్పెయిన్‌(Spain) రాజధాని మాడ్రిడ్‌లో(Madrid) చోటు చేసుకుంది. మాడ్రిడ్‌లోని ఓ షాపులో ఇటీవల ఓ దొంగతనం(Theft) జరిగింది. ఆ ఘటనను కవర్‌ చేయడానికి వెళ్లారు స్థానిక క్యూట్రో ఛానల్‌కు(Cutro Channel) చెందిన ఓ మహిళా రిపోర్టర్‌. చోరీ జరిగిన స్టోర్‌ ముందు నిలుచుని తన టీవీ ఛానల్‌కు లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్నారు.

ఓ లేడి జర్నలిస్టు(Female Reporte) లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తోంది. ఆ దారంట నడుచుకుంటూ వస్తున్న ఓ వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. అసభ్యంగా తాకాడు. ఈ ఘటన స్పెయిన్‌(Spain) రాజధాని మాడ్రిడ్‌లో(Madrid) చోటు చేసుకుంది. మాడ్రిడ్‌లోని ఓ షాపులో ఇటీవల ఓ దొంగతనం(Theft) జరిగింది. ఆ ఘటనను కవర్‌ చేయడానికి వెళ్లారు స్థానిక క్యూట్రో ఛానల్‌కు(Cutro Channel) చెందిన ఓ మహిళా రిపోర్టర్‌. చోరీ జరిగిన స్టోర్‌ ముందు నిలుచుని తన టీవీ ఛానల్‌కు లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్నారు. అంతలో ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. వెనుక నుంచి ఆమెను అసభ్యంగా తాకి వేధింపులకు గురి చేశాడు. వాడి చేష్టలు ఇబ్బంది కలిగించినా తన లైవ్‌ రిపోర్టింగ్‌ను కొనసాగించారామె! అయినప్పటికీ ఆ వ్యక్తి మాత్రం అక్కడ్నుంచి కదల్లేదు. అంతలో ఛానల్‌లోని న్యూస్‌ ప్రెసెంటర్‌ దీని గురించి ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె ఇబ్బంది పడుతూ జరిగిన విషయం తెలిపారు. ఆ వ్యక్తి మాత్రం తానేమీ చేయలేదంటూ బుకాయించాడు. అంతటితో ఆగకుండా మళ్లీ ఆమెను తాకే ప్రయత్నం చేశాడు. అప్పుడామె గట్టిగా వ్యతిరేకించడంతో అక్కడ్నంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దాంతో ఈ సంఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల వరకూ వెళ్లడంతో వారు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

Updated On 14 Sep 2023 5:42 AM GMT
Ehatv

Ehatv

Next Story