ముహుర్త సమయం దాటిన ఇంక అబ్బాయి రాకపోవడంతో వధువు కుటుంభ సభ్యులు ఆందోళన చెందారు . ఏమయిందో అంటూ కంగారు పడ్డారు .కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే అబ్బాయి పుల్లుగా మందు కొట్టి.. మద్యం మత్తులో పెళ్లి ముహుర్తాన్ని మరచిపోయాడట .

పెళ్లి అనేది జీవితంలో ఒక మధుర స్మృతి... పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. . కానీ ఓ పెళ్లికొడుకు మాత్రం తన పెళ్లి సమయాన్నే మర్చిపోయాడు.. తీరా గుర్తుకు వచ్చి పెళ్లి మండపానికి ఆలస్యంగా వెళ్లడంతో .. ఆ పెళ్లి కూతురు ఆలస్యానికి అసలు కారణం తెలుసుకొని నాకు ఈ పెళ్లి వద్దంటూ ఆ పెళ్లి ని రిజెక్ట్ చేసి వెళ్లిపోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.

బీహార్ భాగల్ పూర్ ప్రాంతానికి చెందిన మియాన్ అనే యువకుడికి ...సుల్తాన్ గంజ్ కు చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. అయితే మంగళవారం ఉదయం పెళ్లి ముహుర్తం పెట్టారు. ముహుర్త సమయానికి పెళ్లి మండపంలో బంధు మిత్రులతో...మేళాతాళాలతో సందడిగా ఉంది.. మరోవైపు వివాహామండపానికి చేరుకున్నా ఇరువర్గాల తల్లిదండ్రులు , అబ్బాయి రాకకోసం ఎదురు చూస్తున్నారు. ..ముహుర్త సమయం దాటిన ఇంక అబ్బాయి రాకపోవడంతో వధువు కుటుంభ సభ్యులు ఆందోళన చెందారు . ఏమయిందో అంటూ కంగారు పడ్డారు .కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే అబ్బాయి పుల్లుగా మందు కొట్టి.. మద్యం మత్తులో పెళ్లి ముహుర్తాన్ని మరచిపోయాడట . పెళ్లి మండపానికి కూడా అతడు మద్యం సేవించి రావడంతో ...విషయం తెలుసుకొని ఆ అమ్మాయి నాకు ఈ పెళ్లి వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. వధువు అలా చేయడంతో ఆ అబ్బాయికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందట .

Updated On 17 March 2023 4:59 AM GMT
Ehatv

Ehatv

Next Story